రివ్యూ

పవర్ తగ్గిన పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవచం ** ఫర్వాలేదు
**
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణె,
పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్
సంగీతం: తమన్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని
దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ల
**
ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కిడ్నాప్ కుట్రలో ఇరుక్కుంటాడు. మంచి ఆఫీసరన్న ప్రతిష్టపై మచ్చపడింది. ఆ పరిస్థితికి ఎదురొడ్డి తన నిజాయితీని 24గంటల్లో ఎలా నిరూపించుకున్నాడు -అన్నది కవచం ఇతివృత్తం.
యాక్షన్, మసాలాకు ఎక్కువ అవకాశమున్న లాగ్ లైన్‌ను ‘కవచం’గా మలుచుకుని తెరకెక్కించాడు కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల. కాకపోతే పోలీస్ కథలో టెంపోను చూపించగలిగే విధంగా క్యారెక్టర్లను మలుచుకోలేకపోయాడు. పైగా కథను వేగంగా నేరేట్ చేయడంలో దర్శకుడి అనుభవరాహిత్యం ఆడియన్స్‌పై బలమైన ప్రభావానే్న చూపించింది. టైటిల్ స్ట్రాంగ్‌గావున్నా, కథ మొత్తం మామూలు పోలీస్ కథగా సాగిపోయింది.
సినిమా విడుదలకు ముందే మీడియాతో మాట్లాడుతూ -మాస్, యాక్షన్ చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆదినుంచీ మాస్ కథలతోనే ప్రయాణం చేస్తున్నాడు కూడా. ఆ కోణంలో ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వైఫల్యానే్న మిగిల్చినా, మరోసారీ యాక్షన్ కంటెంట్ కథనే ఎంచుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ పాత్రతో ‘కవచం’ చేశాడు. ఇంతకుముందు చేసిన ‘సాక్ష్యం’ పరాజయాన్ని అధిగమించేందుకు ‘కవచం’ సినిమానైతే వేగంగా పూర్తి చేశాడుకానీ, కథలో తగ్గిన వేగంపై దృష్టిపెట్టలేకపోయాడు. దర్శకుడు, హీరో.. ఇద్దరు శ్రీనివాస్‌ల ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం.
విశాఖలో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). అక్కడ సిరీస్‌గా సాగుతున్న కిడ్నాపులపై దృష్టిపెడతాడు. అలా ఓ మంచి ఆఫీసర్‌గా ప్రజలనుంచి నమ్మకాన్ని చూరగొంటాడు. సిటీలోని గ్యాంగ్‌ల భరతంపట్టే సమయంలో ఓ బ్యూటీ లావణ్య (మెహరీన్) తారసపడుతుంది. ఓ పెద్ద కంపెనీ వారసులైన సంయుక్త (మెహరీన్)ని ప్రమాదం నుంచి కాపాడిన విజయ్, తరువాత రూ.50 లక్షల కోసం ఆమెనే కిడ్నాప్ చేస్తున్నట్టు నాటకం ఆడాల్సి వస్తుంది. తన తల్లి కోసం ఆ కిడ్నాప్ నాటకానికి పాల్పడతాడు విజయ్. కానీ తాను కాపాడింది, కిడ్నాప్ చేసింది నిజమైన సంయుక్తని కాదని, ఆ పేరుతో పరిచయమైన లావణ్య (మెహరీన్)ననే విషయం ఆలస్యంగా తెలుస్తుంది. అదే టైంలో నిజమైన సంయుక్త (కాజల్) నిజంగానే కిడ్నాప్‌నకు గురవుతుంది. కోటీశ్వరుడి బిడ్డ సంయుక్తని కిడ్నాప్ చేశాడన్న కుట్రలో ఇరుక్కుంటాడు విజయ్. ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా ఆ నిందని ఎలా తుడిచేసుకున్నాడు? అసలు సంయుక్తని కిడ్నాప్ చేసిందెవరు? ఆమెని ఎలా రక్షించాడు? సంయుక్తగా విజయ్ జీవితంలోకి వచ్చిన లావణ్య అసలు కథేమిటి? ఈ ట్విస్టులకు సమాధానాలే తెరపై చూడాల్సిన సినిమా.
పోలీస్ విజయ్ పాత్ర శ్రీనివాస్‌కు టైలర్‌మేడ్. వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్న అనుభవంతో -పాత్రను రక్తికట్టించగలిగాడు. ఫిట్‌నెస్‌తో యాక్షన్ ప్యాకడ్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, శ్రీనివాస్ కష్టానికి కథ అడ్డం తిరిగింది. విజయ్ క్యారెక్టరైజేషన్ బలంగా చూపించే సన్నివేశాలు స్క్రిప్ట్‌లో లోపించాయి. కవచంలాంటి టైటిల్‌కు అనుగుణంగా క్యారెక్టరైజేషన్‌ను నేరేట్ చేసే విధానం కూడా లేదు. మంచి థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత సరుకున్నా, కథని పకడ్బందీగా చెప్పడంలో దర్శకుడి వైఫల్యం హీరో కెరీర్‌మీదా ప్రభావం చూపేలా ఉంది. ఫస్ట్ఫా సీన్స్ సాధారణంగా సాగిపోతే, విరామ సమయం నుంచే అసలు కథ మొదలైంది. ఊహించని కొన్ని ట్విస్ట్‌లు రేకెత్తించే ఆసక్తి తప్ప, కథలో లీనమయ్యేలా కంటెంట్‌ను నేరేట్ చేయలేకపోయాడు దర్శకుడు శ్రీనివాస్. సినిమా మొత్తం ఏమాత్రం థ్రిల్‌ని పంచేదిగా లేదు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథలు చూసేసిన తెలుగు ఆడియన్స్‌కి -కళ్లముందు సాగిపోతున్న ఓ సాధారణ పోలీస్ సినిమానే కనిపించింది. ఆహ్లాదం కోసం ఆవగింజంత వినోదాన్ని పెట్టాల్సిన దర్శకుడు -పోలీస్ స్టోరీలో పాటలు, ప్రేమ సన్నివేశాలు కుక్కడంతో కథ మరీ తేలికైపోయింది. బిగింపుగా సాగుతున్న సమయంలో పాటలు, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు గుదిగుచ్చడం -ఆడియన్స్‌లో ఉత్సుకత కనిపించలేదు. ప్రథమార్థం పాత్రల పరిచయం, ప్రేమ సన్నివేశాలకే పరిమితమై కథను వదిలేశాడు దర్శకుడు. విరామం తర్వాత మలుపులు, మైండ్‌గేమ్‌లకి ప్రాధాన్యతనిచ్చాడు. అవీ ప్రేక్షకుడు పసిగట్టగలిగే ట్విస్టులే కావడం, మైండ్‌కి పని చెప్పాల్సినంత గేమ్‌లు లేకపోవడం.. సినిమాకి మైనస్ అయ్యాయి. సంయుక్త కిడ్నాప్ ఘట్టమే సినిమాకు ప్రాణమైనా -సీరియస్ పాయింట్‌ని సాదా సీన్ చేసేయడం అనుభవ రాహిత్యానికి పరాకాష్ట. పతాక సన్నివేశాలన్నీ సగటు కమర్షియల్ సినిమా డిజైనే్ల.
హీరోయిన్లు కాజల్, మెహరీన్ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. పాత్రల ప్రాథాన్యతకంటే, బ్యూటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ముఖ్య పాత్రలు ఎలివేట్ కాలేదు. పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం వాళ్లకూ దక్కలేదు. విలన్ ఎంత టెర్రిఫిక్ అయితే, హీరో అంతగా ఎలివేట్ అవుతాడన్న కనీస పాయింట్‌నూ దర్శకుడు పట్టించుకోలేదు. విక్రమాదిత్య పాత్రలో నీల్ నితిన్ ముఖేష్‌ను చూపించిన విధానమే సాదాసీదాగా ఉంది. విలనిజం పండలేదు. పోసాని, ముఖేష్ రుషి, సత్యం రాజేష్, హరీష్ ఉత్తమన్‌లాంటి నటులకూ స్కోప్ లేకుండా పోయింది. సాంకేతికంగా సినిమాకు వంక పెట్టాల్సిన పని లేదు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌లు తమ టాలెంట్‌ను చూపించినా సినిమాను రక్షించలేకపోయారు. తొలి సినిమా సత్తా చాటడంలో దర్శకుడు శ్రీనివాస్ మామిళ్లను గొప్పగా చెప్పుకోలేం. మాటలు, కొన్ని సీన్ల డిజైన్‌తో ఓకే అనిపించుకున్నా, కథని నడిపించే విధానంలో వేగాన్ని అందుకోలేకపోయాడు. స్క్రీన్‌ప్లేతోనూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ‘కవచం’ -హీరో పోలీస్ కథ కాలేకపోయింది.

-విజయ్