రివ్యూ

మూడోగదిలో సీకటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుగారి గది- 3 * బాగోలేదు
*
తారాగణం: అశ్విన్‌బాబు, అవికాగోర్, ఆలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, ధన్‌రాజ్, అజయ్‌ఘోష్, ఊర్వశి, హరితేజ, శివశంకర్ మాస్టర్ తదితరులు
సంగీతం: షబ్బీర్
కూర్పు: గౌతంరాజు
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాణ సంస్థ: ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం: ఓంకార్
*
యాక్టర్ డైరెక్టరైనట్టే.. యాంకర్ నుంచి డైరెక్టరయ్యాడు -ఓంకార్. అతన్నించొచ్చిన తాజా హారర్ కామెడీ రాజుగారి గది 3. విడుదలకు ఒక్కరోజు ముందు ఓంకార్ ఓ మాటన్నాడు. హారర్ సినిమాలు చూడొద్దని పిల్లల్ని వారించే పెద్దలే.. -పిల్లల్ని తీసుకెళ్లి చూపించదగ్గ హారర్ సినిమా చేశానని. ఈ కోణంలో సినిమా చూస్తే.. మంచి హింటిచ్చాడే తప్ప కంటెంట్ మర్చిపోయాడనిపిస్తుంది. ఆధునిక యుగంలో హారర్ నిర్వచనం ఎప్పుడో మారింది. పిల్లలు -ప్రేతాత్మల్ని పప్పెట్లలా చూస్తున్నారే తప్ప, వణకడం మానేశారెప్పుడో. ‘బ్లూవేల్స్‌ని’, ‘డెత్‌గేమ్’లనే చాలెంజ్ చేస్తోన్న జనరేషన్స్ భయపడే భయాలు వేరు. వేగంగా లారీ దూసుకొస్తుంటే.. రోడ్డుకు అడ్డంపడిన పప్పీని చూసి భయపడతారు చచ్చిపోతుందేమోనని. అదే లారీకి అడ్డంగా ప్రేతాత్మను నిలబెడితే.. పిచ్చిగా నవ్వుతారు, లేదంటే లేచెళ్లిపోతారు. అందుకే -‘పిల్లలు చూసే హారర్’ అన్న హింట్ బావుందిగానీ, ‘హారర్’ ప్రాసెస్‌ని కాలానుగుణంగా పాలిష్ చేయలేకపోయిన -రాజుగారి గది 3కి మాత్రం అంత సీన్ లేదనిపించింది.
**
ఆర్జీజీ ప్రాంచైజీలో -్థర్డ్ పార్ట్ ఈ సినిమా. మొదటి ‘గది’లో -్భయపెట్టిన నిజాయితీ నెగ్గింది. ఆ సక్సెస్‌ను స్టార్స్‌కి ఎప్పుడైతే అప్లై చేశారో.. రెండో ‘గది’లో అతి ఎక్కువై’పోయింది. ఇప్పుడు -మాటిచ్చిన తమ్ముడ్ని మాస్ హీరో చేయాలన్న బృహత్తర తాపత్రయం మితిమీరడంతో -కథే అంతర్థానమైపోయింది.
మాయ (అవికాగోర్) ఓ డాక్టర్. ఎవరైనా ఆమెను టచ్ చేస్తే -తోలు తీసేయడానికి సిద్ధంగా ఉంటుంది ఓ ఆత్మ. ఈ ఇంట్రోనుంచి సిటీలోని ఓ కాలనీకెళ్తుంది కథ. అక్కడ ఆటో అశ్విన్ (అశ్విన్‌బాబు) అనాథ. ఆలీతో కలిసుంటూ.. మందుకొట్టడం, గోలపెట్టడం వాళ్ల రోటీన్ లైఫ్. కాలనీకి ఓ పీడలా తయారైన అశ్విన్‌ని తరిమికొట్టే మాస్టర్ ప్లాన్ వేస్తాడు -మాయతో కలిసి పనిచేసే ఓ డాక్టర్ కమ్ కాలనీవాసి. అలా కాలనీవాళ్ల సూపర్ ప్లాన్‌లో ఇరుక్కున్న అశ్విన్ -మాయకు ఐ లవ్ యూ చెబుతాడు. ఆటోమేటిక్‌గా ఆత్మ ఓ ఆటాడేసుకుంటుంది. ఇక్కడే ఓ సీక్రెట్ రివీలవుతుంది. మాయ తండ్రి గరుడ పిళ్లై (అజయ్‌ఘోష్) ఓ కేరళ మాంత్రికుడని, ఆమెకు రక్షణగా యక్షిని పెట్టాడని. మాయా’మోహాన్ని తేల్చుకోడానికి మావ (అలీ)తో కేరళలో అడుగుపెడతాడు అశ్విన్. అక్కడ అశ్విన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎలాంటి సీక్రెట్స్ రివీలయ్యాయి. అసలు మాయకు సెక్యూరిటీవున్న యక్షి ఎవరు? ఆమెనెలా ఎదుర్కొన్నాడు. ఈమెనెలా సొంతం చేసుకున్నాడు?లాంటి ప్రశ్నలకు -ఆర్జీజీ పాసేజ్‌లో ఆన్సర్లు దొరకటంతో థర్డ్ పార్ట్ ముగుస్తుంది.
**
భయం హాస్యం రెండూ రంగరించి కమర్షియల్ అనే కొత్తరసాన్ని జుర్రుకోవాలన్న తాపత్రయమే సినిమాలో బెడిసికొట్టింది. జోనరేదైనా -కథ బలంగావుంటే ఆడియన్స్ కనెక్టవుతారన్న సూత్రాన్ని నమ్మే దర్శకుడు.. సినిమాలో మాత్రం పాటించలేకపోయాడు. నిజానికి రాజుగారి గది ఓంకార్‌ని దర్శకుడిగా నిలబెట్టిన సినిమా. ఆ సక్సెస్‌ను సిరీస్ చేయాలన్న ఆలోచనా -అతని సినిమాటిక్ థాట్స్‌కి ప్లస్ పాయింట్. కాని -దాన్ని కంటిన్యూ చేయటంలో మాత్రం సెకెండ్ పార్టుతోనే ఫెయిలయ్యాడు. థర్డ్ పార్ట్‌లో ఫెయల్యూర్‌ని రిపీట్ చేశాడు.
లాజిక్ లెస్ కహానీని లాజికల్‌గా చెప్పడమే -హారర్ ఫార్మాట్ అన్న విషయం ఓంకార్‌కి తెలీదనుకోలేం. కాకపోతే -పిసరంత కథ చెప్పడానికి కొసరు అంశాలు ఎక్కువ ఏరి తెచ్చుకోవడంతో ‘గది’లో కంగాళీతప్ప కథ మాయమైంది. కథాబీజమైన యక్షిని కథగా మలిచే ప్రక్రియలో రొటీన్ సినిమాల ప్రభావానికి గురైనట్టే అనిపిస్తుంది. ఫస్ట్ఫాలో మొనాటినీ డ్రామా డామినేట్ చేయడంతో -సెకెండాఫ్ మొదలయ్యేసరికే ఆడియన్స్ ‘అవుటాఫ్ ఆడిటోరియం’ అయిపోయారు. కేరళలో అడుగుపెట్టిన దగ్గర్నుంచే కానె్సప్ట్‌లోని కథ మొదలవుతుంది. అప్పటి వరకూ సాగదీత సన్నివేశాల్ని ఆడియన్స్ భరించక తప్పదు.
అందరినీ భయపెట్టే గరుడపిళ్లై, జగన్మాతకు రాజమహల్లో ఎదురయ్యే అనుభవాలే హాస్యం అనుకుంటే -సినిమాలో కామెడీకి కొరతలేదనాలి. యక్షి వివరాల కోసం తాళపత్ర గ్రంథాల అనే్వషణ సన్నివేశాల్లోనూ నవ్వించే ప్రయత్నంలో భాగంగా చీప్ ట్రిక్స్‌ని ఆశ్రయంచక తప్పలేదు. ఆత్మ వెనుక అసలు నిజాలు బయటపెట్టే విధానమూ గ్రిప్పింగ్‌గా లేకపోవటంతో -హారర్ సినిమా ఫీలింగ్‌కు దూరంగానే ఉండిపోతాం. అశ్విన్ చుట్టూ తిరిగే కథ కనుక -మాస్ మన్నన కోసం అతను పడిన కష్టం ఓకే. అవికాగోర్‌కు అంత ‘సీన్’ లేదు. అజయ్‌ఘోష్, ఊర్వశి, ఆలీ తదితర కామెడీ పాత్రలు నవ్వించడానికి తమవంతు గట్టిగానే కృషి చేశాయి. టెక్నికల్‌గా షబ్బీర్ సంగీతం, గౌతంరాజు కూర్పు ఫరవాలేదు. లైటింగ్ ఎఫెక్టులో చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌నెస్ ఆపాదించింది. నిర్మాణ విలువల్లో ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక మెట్టెక్కింది.

-ప్రవవి