రంగారెడ్డి

టీడీపీ నాయకుల ముందస్తు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 12: గజ్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వటంతో ఘట్‌కేసర్ పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టులు నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం ఎస్టీ సెల్ అధ్యక్షుడు నానావత్ రూప్‌సింగ్ నాయక్, మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి వేముల సంజీవ గౌడ్, నాయకులు బొట్టు సూరి, సాయిలు, అయిలయ్యను ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రతాప రెడ్డి అరెస్టును నిరసిస్తు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ జరిపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థి సంఘం నాయకులు నానావత్ శివాజీ నాయక్, మహేష్ కుమార్, నాగరాజు గౌడ్, భానుత్కర్, రాము గౌడ్, దామర రాజు ఉన్నారు. పోలీసు స్టేషన్‌లో ధర్నాకు దిగి నినాదాలు చేశారు.
ప్రతాప్ రెడ్డి అరెస్టు చట్టవ్యతిరేకం
రాజేంద్రనగర్: టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిని చట్టవ్యతిరేకంగా అరెస్ట్ చేశారని రాజేంద్రనగర్ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం క్యాంపు ఆఫీసు కార్యాలయానికి వెళ్తుండడాన్ని గుర్తించిన పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మ్యాడం రామేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.్భపాల్ రెడ్డి, కృష్ణగౌడ్, ఎస్.రాజ్‌కుమార్, కృష్ణారెడ్డి, ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, కే.కొండా రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

బస్సుల దగ్ధం కేసు ..విద్యార్థ్ధి నేతల అరెస్టు
ఉప్పల్, జనవరి 12: ఆర్టీసీ బస్సుల దగ్ధం కేసులో నలుగురు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నేతలను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డిసిపి ఉమా మహేశ్వర శర్మ తెలిపారు. 19న ఓయూ ఎన్‌ఆర్‌ఎస్‌లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆదేశంతో నల్లచెరువు వద్ద ఆర్టీసీ హైర్ బస్సులపై పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. నిందితులను అరెస్టు చేసి చేసి శుక్రవారం రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.