రంగారెడ్డి

క్షేత్రగిరి వెంకన్న జాతరకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 14: మేడ్చల్ మండలం ఘణపూర్ గ్రామ శివారు శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ గ్రామ శివారు ఎతైన కొండల్లో వెలిసిన శ్రీ క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు దేవాదాయశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ప్రతి ఏడాది సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ రోజున క్షేత్రగిరి వేంకటేశ్వరస్వామి జాతరను నిర్వహించడం అనాయితీగా వస్తోంది. ఎతైన కొండలపై పచ్చని ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లదకరమైన వాతావరణంలో వెలిసిన క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి ఎంతో మహిమనిత్యాలు కలిగిన దైవంగా భక్తులు వ్విశసిస్తారు. క్షేత్రగిరి వేంకటేశ్వరస్వామి వారి జాతరమహోత్సవంలో భాగంగా శనివారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు పేర్కొన్నారు. ఆలయానికి రంగులు వేసి పచ్చని తోరణాలు, విద్యుత్ దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. సోమవారం 15న మకర సంక్రాంతి, స్వామివారి మొక్కుబడి సేవలు, సామూహిక అర్చనలు, 16వ తేదీ కనుమ రోజున స్వామివారి కల్యాణం, పల్లకీ సేవ, జాతర మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. పేట్‌బషీరాబాద్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తుతో పాటు రవాణా సౌకర్యం, వైద్య శిబిరం, పార్కింగ్, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలు మండలాలతో పాటు మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రజలే కాకుండా నగరం నలుమూలల నుండి వేలాది భక్తులు తరలివస్తారు. క్షేత్రగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ఘనచరిత్ర ఉంది. 1970 సంవత్సరంలో పూడూరు గ్రామానికి చెందిన శివరాంరెడ్డి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. 1980 సంవత్సరంలో దేవాదాయ శాఖ తమ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ నిర్మించిన మూలరాట్ విగ్రహాన్ని 2001 సంవత్సరంలో చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు.

అక్రమ దందా

పెట్రోల్ ట్యాంకర్ పేలుడు కేసులో ఇద్దరు అరెస్టు*
10 ఆయిల్ ట్యాంకర్లు, 2 కార్లు, 2 బైక్‌లు, రూ.7.5లక్షలు స్వాధీనం*
మరో ముగ్గురి కోసం గాలింపు*
రాచకొండ జాయింట్ సిపి తరుణ్ జోషి వెల్లడి

ఉప్పల్, జనవరి 14: మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తా సమీపంలో మెకానిక్ షెడ్‌లో జరిగిన పెట్రోల్ ట్యాంకర్ పేలుడు ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కోట్ల విలువ చేసే 10 ఆయిల్ ట్యాంకర్లు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.7.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు ఖదీర్, షర్ఫుద్ధీన్, నరుూంల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మల్కాజిగిరి డిసిపి ఉమా మహేశ్వర శర్మ, ఎస్‌ఓటి అడిషనల్ డిసిపి రఫిక్, మల్కాజిగిరి ఏసిపి గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్లు జగన్నాధరెడ్డి, మునీలతో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ భీంరెడ్డినగర్‌లో నివసిస్తున్న కర్నాటక బీదర్‌కు చెందిన రాజు కులాల్ (37) అతని సోదరుడు చెంగిచర్ల ఆర్టీసి కాలనీలో నివసిస్తున్న జగదీప్ కులాల్ అలియాస్ జగ్గు (34) కలిసి గత పదేళ్లుగా చెంగిచర్ల చౌరస్తా సమీపంలోని స్వంత స్థలంలో మెకానిక్ షెడ్‌లో పెట్రోల్, డీజిల్ దొంగతనం చేసే అక్రమ దందా నిర్వహిస్తున్నారు. పేరుకు మెకానిక్ షెడ్ లోపల చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ దొంగిలించి వాటిని బయట బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నుంచి 100 నుంచి 300 లీటర్లు తీస్తూ అనుమానం రాకుండా లీకేజీల ద్వారా కారిపోయిందని చెప్పుకొస్తారు. గతంలో ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. కొంత కాలం బంద్ చేసి మళ్లీ దందా కొనసాగిస్తున్నారు. సంబధిత అధికారులతో కలిసి ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ నిర్వహిస్తున్న అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుసోంది. షెడ్ నిర్వహిస్తున్న ఇద్దరు అన్నదమ్ములకే ఆయిల్ ట్యాంకర్లు 12 ఉండటం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు షెడ్‌లో ట్యాంకర్‌లో నుంచి పెట్రోల్ తీస్తుండగా అదే సమయంలో మరో ట్యాంకర్ వచ్చింది. రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కన ఉన్న భవనంకు ఢీకొంది. అదే సమయంలో అకస్మాత్తుగా స్పార్క్ (నిప్పురవ్వలు) పెట్రోల్‌లో పడి అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ట్యాంకర్‌లోని ఒక్కొక్క కంపార్ట్‌మెంట్‌లో నుంచి పెద్ద పేలిన శబ్ధంతో మంటలు వ్యాపించి పరిసర ప్రాంతాలకు విస్తరించి భయంకరమైన వాతావరణం నెలకొంది. అదే సమయంలో దారిన వెళ్లే వారిపై పడటంతో 15 మందిలో నల్గురుకి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం విదితమే. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అగ్ని ప్రమాదంగా అధికారులు చెప్పుకొచ్చారు.
కొర్రెములలో మరో అక్రమ కిరోసిన్ డంప్ గుర్తింపు
ఘట్‌కేసర్ మండలం పరిధిలోని కొర్రెములలో రాజు సోదరుకు చెందినదిగా మరో అక్రమ కిరోసిన్ డంప్‌ను గుర్తించినట్లు జాయింట్ సిపి తరుణ్ జోషీ తెలిపారు. ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ను దొంగతనం చేసి బయట బహిరంగ మార్కెట్‌లో బయట మార్కెట్ కంటె తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ దందా ద్వారా ఆయిల్ ట్యాంకర్లు, ఖరీదైన ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేశాడని వివరించారు. ఇదే తరహాలో ఎవరికి అనుమానం రాకుండా అక్కడ కూడా మెకానిక్ షెడ్‌ను నడుపుతున్నాడని తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. అక్రమ దందా వ్యవహారం ఎవరి వాటా ఎంత అన్న విషయంలో విచారణ కొనసాగుతుందన్నారు.

‘గురుకులం’లో అన్నీ కష్టాలే

ఆరుబయటే భోజనం* తాగునీటికి తప్పని కష్టాలు * 240 మంది విద్యార్థులకు * రెండే మరుగుదొడ్లు

షాద్‌నగర్, జనవరి 14: గ్రామీణ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు లేకపోవడంతో భవనాలను అద్దెకు తీసుకొని కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పేరుకే గురుకులం.. సౌకర్యాలు లేకపోవడంతో అన్నీ కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలోని ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకొని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వౌలిక వసతులతోపాటు నాణ్యమైన భోజనం పెట్టాల్సి ఉన్నప్పటికి స్థానిక అధికారులు అవేమి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పవచ్చు. బీసీ బాలుర గురుకుల పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ లేకపోవడంతో ఆరుబయటే నేలపై కూర్చోని భోజనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 240 మంది విద్యార్థులకు ఆరు మరుగుదొడ్లు ఉండగా అందులో రెండు మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో విద్యార్థులు అట్టముక్కలను అడ్డుగా పెట్టుకొని కాలం వెలదీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యార్థులు అంటున్నారు. అసలే చలికాలం.. ఆపై కిటికీలకు అద్దాలు లేకపోవడంతో ఎలా ఉండాలంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాధులే లేకుండా పోయారని వాపోతున్నారు. ప్రతినెల రూ.2.56లక్షల అద్దె చెల్లిస్తున్నప్పటికీ సౌకర్యాలు లేకపోవడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తుందే తప్ప ఆచరణలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఆటలు అడుకునే స్థలంలోనే విద్యార్థులకు భోజనం చేయించడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు. కార్పొరేట్ విద్యను ధీటుగా గురుకుల పాఠశాలలు నెలకొల్పామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమయ్యారనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం
* బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజేందర్
బీసీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రిన్సిపాల్ విజేందర్ వివరించారు. బీసీ గురుకుల పాఠశాలలో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, స్పందన కరువైందని పేర్కొన్నారు. మరోమారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల సాధన కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కీసర, జనవరి 14: ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని మృతి చెందిన సంఘటన నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన వినోద్‌కుమార్ (20) కుషాయిగూడ నుండి అహ్మద్‌గూడ వైపు వస్తున్నాడు. నాగారం గ్రామ పరిధిలోని ఐకాం మూలమలుపు వద్ధకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైండర్‌ను ఢీకొట్టింది. దుర్ఘటనలో వినోద్‌కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుజరుపుతున్నారు.