రంగారెడ్డి

దొంగల హల్‌చల్.. పలు చోట్ల చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జనవరి 16: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. భారీగా నగలను అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇరిగేషన్ డిపార్డుమెంట్‌లో ఏఈగా విధులు నిర్వహించే జూగంటి ఖాసీం.. మీర్‌పేట్ రాఘవనగర్‌లో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని.. ఖాసీం తన భార్య జ్యోతి, పిల్లలతో కలిసి పండుగకు స్వగ్రామం నల్లగొండకు వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా, ఇంటిలోని వస్తువులు చిందర వందరంగా పడి ఉన్నాయి. బీరువాను పగుల గొట్టి చూడగా దాదాపు 25 తులాల బంగారు నగలు, రూ.లక్ష అపహరణకు గురైనట్లు గుర్తించిన ఖాసీం భార్య జ్యోతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించే మధుసుదన చారి ప్రగతి కాలనీలో నివాసం ఉంటున్నాడు. పండుగకు భార్య ఊరికి వెళ్లింది. మధుసుదనచారి సోమవారం రాత్రి విధులకు హాజరయ్యారు. ఎవరూ లేరని గ్రహించి మధుసుధనచారి ఇంటిలో చోరులు చొరబడి రెండు తులాల బంగారు నగలు, రూ.5వేల నగదు చోరీ చేశారు. సంఘటన జరిగిన ప్రదేశాలకు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో నగదు చోరీ
కీసర: ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి నగదు దోచుకెళ్లిన సంఘటన రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంపల్లి గ్రామానికి చెందిన మంచాల శ్రీనివాస్ ఆదివారం కుటుంబీకులతో కలిసి యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం, ఎంకిర్యాల గ్రామానికి సంక్రాంతి పండుగకు బంధువుల ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటికి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి, ఇంట్లో బట్టల్లో దాచుకున్న 22 వేల నగదు అపహరణకు గురికావటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ సురేందర్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని చిందర వందరగా పడవేసిన బట్టలను పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుజరుపుతున్నట్లు సురేందర్‌గౌడ్ పేర్కొన్నారు.