రంగారెడ్డి

శ్రీకోవెల రంగనాయక స్వామి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 16: కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని నానల్‌నగర్‌లోని శ్రీకోవెల రంగనాయక స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జాతర కొనసాగింది. జాతర కోసం ఆలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఆలయంలో గతంలో ఎన్నడూ జరుగని విధంగా వివిధ పోటీలు, రంగోళి, ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు. విజేతలకు బహుమతులను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఆలయంలో ఉన్న వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్రమైన కొనేరులో భక్తులు స్నానాలు ఆచారించారు. కొనేరుకు రోగ నివారణ శక్తి ఉందని ఇక్కడి పూర్వీకుల నమ్మకం. దీంతో భక్తులు సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఈ కొనేరులో స్నానాలను ఆచారించారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయంలో మూడు రోజుల పాటు స్వామి శ్రీకోవెల రంగనాయక స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో..
చారిత్రత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో సంక్రాంతి పండుగ పురస్కారించుకుని రెండు రోజుల పాటు అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. ఆదివారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కుంకుమార్చన జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ అమర్‌సింగ్, సభ్యులు జీ.ప్రహళ్లాళ్లాద్ యాదవ్, అనిల్ కుమార్, శంకర్, నిఖిలేష్, రాకేష్, కృష్ణ, రాజేశ్వర్, నవీన్ పాల్గొన్నారు.
పతంగుల జోరు
సంక్రాంతి పండుగ పురస్కారించుకుని యువతతో పాటు చిన్నారులు కూడా వివిధ ఆకృతులతో కూడుకున్న పతంగులను ఏగురవేశారు. పలు ప్రాంతాలలో భవనాలపై ఎక్కి పతుంగులు ఆకాశంపై ఎగురవేస్తు ఆనందాన్ని తిలకించారు. కొందరు చిన్నారులైతే చిన్న చిన్న పతంగులు, చోటాభీమ్, డోరామోన్, పలు చిత్రాలతో కూడుకున్న పతంగులను ఎగురవేశారు.

21 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

జీడిమెట్ల, జనవరి 16: జగద్గిరిగుట్టపై ఉన్న శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి 47వ బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈనెల 21వ తేదీ నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
మూడు రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రజలకు ఆర్టీసి బస్సు సౌకర్యం, మంచినీరు, వైద్యం, ప్రత్యేకమైన క్యూలైన్‌లు వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులను వేయించి, విద్యుత్ లైట్‌లను ఆలయానికి అలంకరిస్తున్నారు. 21న తెల్లవారుఝాము నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, విశ్వక్సేనారాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం, పుణ్యహవాచనం, వేదపారాయణం, ఆరగింపు, హారతి, మంత్రపుష్పం, 22న ప్రాభోదిక, వేదపారాయణం, నవకలశ అభిషేకం, హోమం, ధ్వజారోహణ, 12 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ద్వజపట కంకణోద్వాసన పండిత సన్మానం, 23న సాయంత్రం 4 గంటలకు స్వామివారి సేవ, ఊరేగింపుతదితర ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కార్యదర్శి ఆంజనేయులు చెప్పారు.