రంగారెడ్డి

భక్తుల కొంగు బంగారం చిత్తారమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 20: కోరుకున్న భక్తులకు కొంగు బంగారమై గాజులరామారం చిత్తారమ్మ దేవీ విలసిల్లుతుంది. ప్రతీ ఏటా మాదిరిగానే ఈసారి అమ్మవారి జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ స భ్యులు ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేశా రు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజుల రామారంలో వెలసిన చిత్తారమ్మ దేవీ అమ్మవారి జాతర ఆదివారం నాడు వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన అమ్మవారి జాతర ఉత్సవాలకు ఇప్పటికే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్యగౌడ్ నేతృత్వంలో ఆదివారం జరిగే అమ్మవారి జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త చర్యలను చేపట్టారు.
శనివారం గవ్యాంత పూజలు, మూలమంత్ర జపము, అవాహియ దేవతాహోమాలు, పూర్ణాహుతి, బలిప్రధానం, రుత్విక్ సన్మానము వంటి పూజలు జరిగాయి. ఈ పూజలకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము మూడు గంటలకు అభిషేకం, నాలుగు గంటలకు విజయ దర్శనం, ఆ తరువాత తలంబ్రాలతో (ఒడిబియ్యం), అమ్మవారి పూజలు ప్రారంభమై, ఉదయం 11 గంటలకు బోనా లు, మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారి ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, వినోద కార్యక్రమాలు, రాత్రి తొమ్మిది గంటలకు బుర్రకథ, సినిమా, వినోద ప్రదర్శనలు సోమవారం ఉదయం వరకు జ రుగుతాయి. 22న ఉదయం 11 గంటలకు రంగం దివ్యవాణి, సాయంత్రం ఉచిత ప్రదర్శనలు, 23, 24,25, 26 తేదీల్లో కుంకుమార్చనలు జరుగుతాయి. చివరి రోజైన 27వ తేదీ ఉదయం 11 గంటలకు అన్నదానంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల జాగ్రత్త చర్యలను చేపట్టింది. జీడిమెట్ల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిఘా నేత్రాల మధ్య ఈసారి అమ్మవారి జాతర కొనసాగుతోంది. ఎప్పటికప్పు డు డాగ్, బాంబు స్క్వాడ్‌లతో పోలీసు లు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. జాతరకు భారీఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.