రంగారెడ్డి

సాంస్కృతిక కార్యక్రమాలతో మనసుకు ఆహ్లాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 21: అభివృద్ధి సంక్షేమం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయటం ఎంత అవసరమో అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటల పోటీలను నిర్వహించి మనసుకు ఆహ్లాదాన్ని పొందుతూ, ఇతరులకు పంచటం అంతే అవసరమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ పాలకవర్గం, చైర్‌పర్సన్, అధికారుల ఆధ్వర్యంలో స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నృత్య పోటీల కార్యక్రమంలో మంత్రి పట్నం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం, స్థానిక పాలక వర్గాలు అనునిత్యం అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తీరిక లేకుండా పని చేస్తుంటారని, సమయానికి అనుకూలంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతుంటే మనస్సు ఉల్లాసంగా ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ యంత్రాంగం స్థానిక పాఠశాలల చిన్నారులు, విద్యార్థులతో నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సహించటం ఎంతో అభినందనీయమని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్ మాట్లాడుతూ అనునిత్యం అధికారులు, ప్రజా ప్రతి నిధులు తమ విధులలో సతమత మవుతుంటారని సమయం దొరికినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటంతో పట్టణ ప్రజల అభిమానాన్ని చురగొంటారని అన్నారు. కాగా పాఠశాల విద్యార్థులతో నృత్యపోటీలు నిర్వహించి ఉత్తేజ పర్చటం, విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తూ చదువులతో పాటు, ఆటపాటల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నృత్య పోటీల నిర్వాహాణకు పట్టణ ప్రముఖులు, వ్యాపార వాణిజ్య సంస్థలు, పలు సేవా సంస్థల ప్రతినిధులు సహాయ సహకారాలు అందించారని తెలిపారు, కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ ఆసీఫ్ ఉస్సేన్, అన్ని పార్టీల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పీ.్భగేశ్వర్లు పాల్గొన్నారు.