రంగారెడ్డి

మంచినీటిలో మురికినీరు కలిసినా పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 30: మంచినీటిలో మురికినీరు కలిసి, దుర్వాసన వస్తున్నా పట్టించుకోరా అని 22వ వార్డు కౌన్సిలర్ సుచరిత ప్రశ్నించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన మున్సిపల్ సాధారణ సమావేశానికి వార్డులో సరఫరా అవుతున్న నీటిని కౌన్సిల్ సమావేశానికి తీసుకువచ్చి చూపారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. స్పందించిన డిఇఇ గోపాల్ మంచినీరు కలుషితంగా సరఫరా అవుతోందని ఎవరికి చెప్పారంటూ కౌన్సిలర్‌ను ఎదురు ప్రశ్నించగా, మూడో వార్డు కౌన్సిలర్ మేక చంద్రశేఖర్‌రెడ్డి సమస్యలు చెబితేనే చెస్తారా, చెప్పకపోతే చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గిన డిఇఇ సమస్య లైన్‌మైన్ వరకే ఉండిపోయిందని, సమస్య పరిష్కరిస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం స్థానికులకు వస్తే గెలిపించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించాలని కౌన్సిలర్ నర్సింగ్‌రావు ప్రతిపాదించగా కౌన్సిలర్ మంజుల స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికకే కాదు ఏదైనా సమస్య వచ్చినపుడు పరిష్కారానికి ఏకగ్రీంగా తీర్మానించాలని సూచించారు. అజెండాలోని 45, 46 అంశాలు ఒకే రకంగా ఉన్నాయని, ఆడిట్ అధికారులు వస్తే ఇబ్బందులు తప్పవని సూచించారు. కౌన్సిలర్ నర్సింలు మాట్లాడుతూ తనకు మాట్లాడే అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా, చైర్మన్ తర్వాత మాట్లాడతామని అనడంతో ఆగ్రహించిన నర్సింలు రెండేళ్ల నుండి మాట్లాడతామంటున్నారు మాట్లాడారా అంటూ ఎదురుదాడికి దిగారు. వార్డులో పనుల కోసం ఇచ్చిన లేఖలన్నింటిని తనకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అజెండాలోని 2, 3, 4, 7, 11, 12 అంశాలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా ఉన్నాయని, వాటిని తిరస్కరించాలని కోరారు. మొత్తం మీద అరగంటలో తూతూమంత్రంగా సమావేశం ముగిసింది. సమావేశంలో కౌన్సిలర్‌లు ఎ.సుధాకర్‌రెడ్డి, లక్ష్మి, సంగీత, సత్యమ్మ, జి.విజయేందర్‌గౌడ్, భరత్, ఇక్బాల్, వైస్‌చైర్మన్ సురేష్, కమిషనర్ డి.జైత్రాం పాల్గొన్నారు.