రంగారెడ్డి

కుమ్మరులను బీసీ-ఏ జాబితాలోకి మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని కుమ్మర్లను ఎంబీసీ జాబితాలో చేర్చుతూ బీసీ-బీ క్యాటగిరీలో కొనసాగుతున్న కుమ్మర్లను బీసీ-ఏ జాబితాలోకి మారుస్తూ కుమ్మర వృత్తిని ఆధునిక పద్ధతులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తెలంగాణ కుమ్మర సంఘం మేడ్చల్ జిల్లా బహిరంగ సభ తీర్మానించింది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామన్‌కోల్ వీరేశం అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో జిల్లా పరిసర ప్రాంతాల నుంచి మూడువేల మంది కుమ్మరులు పాల్గొని తమ సమస్యలను ఎంబిసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు సమర్పించిన వినతి పత్రంలో ఏకరువుపెట్టుకున్నారు. ప్రపంచీకరణ, పారిశ్రామీకరణతో అల్యూమినియం, ఇత్తడి, ప్లాస్టిక్ వస్తువుల తయారీ ప్రవేశంతో కుమ్మరుల వృత్తిదారులు దారిద్ర రేఖకు దిగువన పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సేవకులుగా పని చేస్తున్న కుమ్మర్లకు హైదరాబాద్‌లో 10 ఎకరాలు కేటాయించి కుమ్మర్ల భవన్‌ను నిర్మించాలని, బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా ఫెడరేషన్ నుంచి రుణాలు ఇవ్వాలని, ప్రత్యేక కుమ్మర ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించాలని అన్నారు. గొల్ల, కురుమల తరహాలో 90శాతం సబ్సిడీ ఇచ్చి 10 శాతం కాంట్రిబ్యూషన్ కింద రుణాలు ఇవ్వాలని కోరారు. చట్ట సభలలో కుమ్మరులకు ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. కుండల తయారీకి మట్టి కోసం చెరువులను కేటాయించాలని, వృత్తిపై ఆధారపడ్డ కుమ్మరులకు భవిష్యనిధి పథకం, ఇన్సూరెన్స్ కవరేజీ, ఆరోగ్య భీమా పథకం అమలు చేసి యాభై ఏళ్ల పైబడిన కుమ్మరులకు పింఛన్లు అందజేయాలని పేర్కొన్నారు. గ్రామ దేవతల ఆలయాలలో కుమ్మరులే పూజారులుగా శాశ్వతంగా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.

వీరశైవ లింగాయత్ కులస్థులకు అండగా ఉంటాం
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18: వీరశైవ లింగాయత్ కులస్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక చెరువు కట్టపై మహాత్మ బసవేశ్వరుని విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. నర్సయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాలు లింగబలిజ కులస్థులను విస్మరించాయని అన్నారు. తెరాస ప్రభుత్వం అందుకు భిన్నంగా అభివృద్ధికి పని చేస్తోందని వివరించారు.
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లింగబలిజ కులస్థుల సమస్యలను పరిష్కరిస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పథకాలు ప్రవేశ పెడుతుందని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌వీ రమణారెడ్డి, ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ భరత్ కుమార్, తెరాస నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, లింగబలిజ కులస్థులు లింగప్ప, వీరేశ్వర్, మల్లప్ప, శశిధర్, కుమార్, అశోక్, అరవింద్ పాల్గొన్నారు.