రంగారెడ్డి

ఆన్‌లైన్‌లో కేసుల నమోదులో నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, ఫిబ్రవరి 20: శాంతి భద్రతలను అదుపులో ఉంచి ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఈ-కాప్ రైటర్లుగా పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలని తెలిపారు. కేసుల నమోదులో సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. సాంకేతిక సమాచారం ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు విషయమై సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనివ్వడమే కాకుండా వారి అనుమానాలను నివృత్తి చేస్తూ అవగాహన కల్పించారు. కేసుల వివరాలను ఫేస్‌బుక్‌లోనూ ఆప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రైటర్లకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. డీసీఆర్‌ఎం ఇన్‌స్పెక్టర్ దాసు, ఎస్‌ఐ దాసు పాల్గొన్నారు.
హక్కులను కాలరాస్తే సహించం
షాద్‌నగర్, ఫిబ్రవరి 20: మదాసీ కుర్వల పట్ల రెవెన్యూ శాఖ అధికారులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తే సహించేది లేదని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ ఆరోపించారు. మంగళవారం షాద్‌నగర్ ఆర్‌డిఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష 77వ రోజుకు చేరుకుంది. రంజిత్ కుమార్ మాట్లాడుతూ గొర్రె కాపరులుగా పరిగణించే మదాసీ కుర్వల పట్ల రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మదాసీ కుర్వలకు రెవెన్యూ శాఖ అధికారులు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్మె సంతోష్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, రాంచంద్రయ్య, విష్ణు పాల్గొన్నారు.