రంగారెడ్డి

తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: మేడ్చల్ పట్టణానికి చెందిన గిరిజన సోదరులు భట్టు నాగేశ్వర్‌రావు, వెంకన్నకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా శంషాబాద్ ప్రాంతంలోని త్రిదండి శ్రీమన్నారయణ చిన్న జీయర్‌స్వామి ఆశ్రమంలో చిన్నజీయర్ స్వామి చేతులమీదుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వ్యవస్థాపకుడు చింతపట్ల వెంకటచారి ఆధ్వర్యంలో అవార్డును బహూకరించారు. సమాజ శ్రేయస్సుకు భట్టు సోదరులు సామాజిక అంశాలతో పాటు అనేక అంశాలపై మానవ నైతిక విలువలను పెంపొందించేందుకు నాలుగు వేల పాటలను రచించారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న భట్టు సోదరులు ప్రతిభను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అఖిలభారత బంజారా సేవాసంఘ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్ మాట్లాడుతూ.. గిరిజనుల మతం మార్పిడి అరికట్టేందుకు చిన్నజీయర్‌స్వామి చొరవ చూపాలని కోరారు. మాజీ ఎంపీ ధారవత్ రవీంద్ర నాయక్, రాంజీ నాయక్, తారాచంద్, ధర్మానాయక్, సత్యనారాయణ, డీఎస్ వెంకన్న, తిరుపతి నాయక్ పాల్గొన్నారు.