రంగారెడ్డి

వ్యవసాయ వర్సిటీలో ఊర పిచ్చుకల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 20: ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్వయసాయ కళాశాలలో మం గళవారం నిర్వహించారు. ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసా య కళాశాల ఆడిటోరియం సమీపంలో చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన ప్రారంభోత్సవానికి డీఎస్‌ఏ డాక్టర్ విష్ణువర్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరైన ఆవాసాలు, తిండి, బ్రీడింగ్ కోసం సౌకర్యాలు లేకపోవడం వల్ల ఊరపిచ్చుకలు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై విద్యార్థులు తమ కుంచె ద్వారా ప్రదర్శించారు. పెరిగిపోతున్న పట్టణీకరణ వల్ల పక్షులు ఆవాసాలు కోల్పోయి ప్రమాదాల బారిన పడుతున్న తీరుపై గీసిన చిత్రాలు ఎంతో సందేశాత్మకంగా ఉన్నాయి. కాంక్రీటు నిర్మాణాలతో ఊర పిచ్చుకలు గూళ్లు కట్టుకోలేని పరిస్థితి ఎలా ఏర్పడిందన్న అంశాన్ని సందేశాత్మకంగా చి త్రాలు గీశారు. ఆర్టిస్ట్ కమ్ ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో డాక్టర్ జే.సత్యనారాయణ, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్యామ్యూల్, డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.