రంగారెడ్డి

భూమి ఫౌండేషన్ సేవలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 22: సమాజ సేవకు అంకిత భావంతో పని చేస్తున్న భూమి ఫౌండేషన్ సభ్యుల సేవలు అభినందనీయమని శేరిలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. మాదాపూర్‌లో భూమి పౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా విచ్ఛేసి మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయ వంతం చేయాడానికి భూమి ఫౌండేషన్ వాలంటరీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. సమాజ సేవ అనేది ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా భావించాలన్నారు. భూమి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సమాజాన్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఐటి ఉద్యోగాలు చేసుకుంటూ వారంతరంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నా రు. భూమి ఫౌండేషన్‌కు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని హమిచ్చారు. 250 మంది ఐటి ఉద్యోగులు భూమి ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ చేస్తు ప్రజలను పరిసరాలు శుభ్రం చేయడం, ఆరోగ్యంపై అవగహన వంటి కార్యక్రమాలు చేస్తున్నరన్నారు. పారిశుధ్యం కార్మికుల జీతాలను రూ. 4వేల నుంచి రూ. 12500 పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. పరిశుభ్రతలో మన నగరం మొదటి స్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. భూమి ఫౌండేషన్‌లో ఉత్తమ సేవలందించిన వాలంటరీలకు గాంధీ బహుమతులను ప్రశంస పత్రాలను అందించారు. కార్యక్రమంలో భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు తేజస్వితో పాటు గ్రంధాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, టీఆర్‌ఎస్ నాయకులు ఉప్పల పాటి శ్రీకాంత్, రాజు యాదవ్, ఎర్రగండ్ల శ్రీనివాస్ యాదవ్, కాశినాథ్, జగదీష్, పవన్ పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు 40మంది మత్స యకార్మికులు
వికారాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించేందుకు జిల్లా నుంచి 40 మంది మత్స్య కార్మికులను సోమవారం తీసుకెళ్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి వీ.రజని వెల్లడించారు. భవిష్యత్‌లో చెరువులలో చేపలు ఎలా పెంచాలి, పట్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కాళేశ్వరానికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 873 కేసుల రాజీ
వికారాబాద్, ఏప్రిల్ 22: జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 873 కేసులు రా జీ అయ్యాయి. వాటిలో 259 క్రిమినల్ కేసులు కాగా, 614 బ్యాంక్, విద్యుత్ కేసులు ఉన్నాయి. జిల్లా అదనపు కోర్టు జడ్జి ఏ.్భరతి, ప్రిన్సిపల్ జూనియర్ సివి ల్ జడ్జి కే.కవిత బెంచ్ నిర్వహించగా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.నాగరాజు, ఉపాధ్యక్షుడు రా ము, ప్రధాన కార్యదర్శి జీ.రమేష్‌గౌడ్, సంయుక్త కార్య దర్శి పార్థసారథి, కోశాధికారి డీ.శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు పీ.గోవర్ధన్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సీఐ, ఎస్‌ఐలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.