రంగారెడ్డి

అభివృద్ధిలో చైతన్యపురి ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, ఏప్రిల్ 22: చైతన్యపురి డివిజన్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు చామకూర మల్లారెడ్డి అన్నారు. చైతన్యపురిలో ఏర్పాటు చేసిన పార్కు, పనిగిరి కాలనీలో అండర్ డ్రైనేజీ, ట్రాన్స్‌ఫార్మర్లు, భవానీనగర్‌లో అండర్ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణాలు, చైతన్యపురి నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆదివారం ఎల్‌బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఎంపీ మల్లారెడ్డి మట్లాడుతూ ప్రభుత్వం ప్రతి డివిజన్ అభివృద్ధి, వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి మాట్లాడుతూ మెత్తం కోటి పది లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాణి, విజయరాణి, యాదగిరి, కృష్ణ, శ్రీనివాస్, పూర్ణచందర్, జయశ్రీ, తలసిదాస్ పాల్గొన్నారు.
రెండంచెల విధానం అమలు చేయాలి
* ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన బ్యాంక్ ఉద్యోగులు
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 22: సహకార బ్యాంక్ వ్యవస్థలో రెండంచెల విధానం అమలు చేసేందుకు ప్రభుత్వంతో చర్చించాలంటూ షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్‌కు ఆదివారం బ్యాంక్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. షాద్‌నగర్ కో ఆపరేటీవ్ బ్యాంక్ మేనేజర్ ఎర్రగుంట దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ కు వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. ఎర్రగుంట దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ సకాహర బ్యాంక్ వ్యవస్థలో రెండంచెల విధానం అమలు చేస్తే రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఇతర బ్యాంకు ల కంటే సహకార బ్యాంక్ రైతులకు అతి చేరువలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రెండంచెల విధా నం అమలు చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చేందుకు వీలుంటుందని వివరించారు. రాష్ట్ర స్థాయిలో సహకార బ్యాం క్ ఉద్యోగులు ఇదే విషయంపై చర్చిస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చించే విధం గా ఎమ్మెల్యే కృషి చేయాలని కోరినట్లు వివరించారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చించి రెండంచెల విధానం అమలయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసిస్టెంట్ జీఎం జ్యోతిరాణి, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీనారాయణ రెడ్డి, రఘునందన్‌శర్మ, సీఈవో మహ్మద్ షరీఫ్, స్ట్ఫా హరికృష్ణ, మానస, గీత, హరీష, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.