రంగారెడ్డి

షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్ మండల పరిధిలోని షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అందజేశారు. గురువారం రాజేంద్రనగర్ మండల కార్యాలయంలో మండల తహశీల్దార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ కేఎస్ దయానంద్ పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి

వనస్థలిపురం, ఏప్రిల్ 26: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శారద నగర్ కాలనీ ఫేస్-3లో గత కొన్ని రోజుల నుంచి కాలనీ వాసులు డ్రైనేజీ మురుగు సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.టి సమస్యపై కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు, సంబంధింత అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాథుడు లేడు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి.. సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. విన్నపం మేరకు సామ రంగారెడ్డి సొంత నిధులతో కాలనీలోకి వచ్చే డ్రైనేజీ నీరును మళ్లించడానికి డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేశాడు. దీనితో సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. సమస్యను పరిశీలించి, సామ రంగారెడ్డి ,ప్రభాకర్ రెడ్డి కావాలని డ్రైనేజీ మురుగు నీరును తమ సొంత గడ్డి పొలాలకు మళ్లించారని, దీనితో దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో సంఘటన స్థలానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి చేరుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కావాలని డ్రైనేజీ పైపు లైన్‌లను పగలగొట్టి సొంత పొలాలకు నీటిని మళ్లించారని కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి ఆరోపించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతవరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఎస్‌ఐ విజయ్.. ఇరువర్గాలకి సర్దిచెప్పిడంతో సమస్య సద్దుమునిగింది. సామ రంగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రైనేజీ పైపులైన్లను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదని, తమ పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వార్ఘీ నీటిని అందిస్తున్నామని తెలిపారు. నెలకు రూ. 72వేలు కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. కాలనీ వాసులు కోరిక మేరకు డ్రైనేజీ సమస్య నుంచి రక్షించడానికి తమ సొంత నిధులతో డ్రైనేజీని మళ్లించినట్లు చెప్పారు. కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి తమ అసమర్ధతను సమర్ధించుకోవడానికి రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు.
సామ తిరుమల్ రెడ్డి సొంత ప్రచారాలు మానుకొని రాజకీయాలకు అతీతంగా కాలనీ వాసుల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని వారు సూచించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల సలహాల మేరకు సమస్య పరిష్కారం కోసం పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.