రంగారెడ్డి

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్‌పై స్పష్టత ఇవ్వాలి: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మే 20: లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నందిగామ మండల పరిధిలోని రంగాపూర్‌లో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీవర్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని చెప్పి నేటి వరకు ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రస్తావించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న నేటి వరకు ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఎలాంటి పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మాయమాటలతో ప్రజలను అభ్యపెడుతున్నారని, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. షాద్‌నగర్ ప్రాంతం రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్నప్పటికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని వాపోయారు. పరిశ్రమలతో కాలుష్యం మిగిలిందని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. బీజేపీ షాద్‌నగర్ అసెంబ్లీ కన్వీనర్ దేపల్లి అశోక్‌గౌడ్, నందిగామ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, జిల్లా కార్యదర్శి నర్సింహ గౌడ్, నేతలు మాణిక్యం, సతీష్, కృష్ణ యాదవ్, ప్రవీణ్, సురేష్, మల్లేష్, రమేష్ పాల్గొన్నారు.

కిడ్నాపర్ల పుకార్లను నమ్మవద్దు
కేశంపేట, మే 20: ఇదిగో దొంగలు.. అదిగో వచ్చారు.. చిన్నపిల్లలను తీసుకువెళ్తున్నారు.. కిడ్నాపులకు పాల్పడుతున్నారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దంటూ కేశంపేట ఎస్‌ఐ బాల్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఎవరు పెట్టవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడంతోపాటు ఒంటరిగా ఉన్న మహిళలను హత్య చేస్తున్నారని వస్తున్న వదంతులతో కొన్ని గ్రామాల్లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని వివరించారు. రాత్రి ఎనిమిది గంటలు దాటితే గ్రామాల్లో గ్రూపులుగా ప్రజలు ఏర్పడి చర్చలు చేస్తున్నారని, ఇలాంటి విషయాలను ఎవరు పట్టించుకోవద్దని తెలిపారు. అనుమానం కలిగిన వ్యక్తులను స్థానిక పోలీసులకు సమాచారం అందించేందుకు ప్రజలు కృషి చేయాలని ఎస్‌ఐ కోరారు.
షాబాద్: సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ప్రజలు తొందరపడి నమ్మవద్దని షాబాద్ ఎస్‌ఐ రవికుమార్ అన్నారు. ఆదివారం షాబాద్ ఠాణాలో విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న పిల్లలను ఎత్తుకపోయే గ్యాంగ్ వచ్చిందని రాత్రిపూట ప్రజలంతా గ్రామాల్లో నిదురపోకుండా జాగరణ చేస్తున్నారని తెలిపారు. గ్రామంలోని ప్రజలందరు ఇవ్వన్నీ అసత్య వార్తలు, రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగలేదని వివరించారు. తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వస్తున్న వాటిని ఎవ్వరు నమ్మవద్దని సూచించారు.