రంగారెడ్డి

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 21: రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సనగారి కొండల్ రెడ్డి అన్నారు. జిల్లాలో గ్రంథాలయ భవన నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టేందుకు సోమవారం రూ.61.55 లక్షల చెక్కును రాష్ట్ర విద్య, సంక్షేమం, వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఇంజనీరుకు అందజేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 15 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయని చెప్పారు. మర్పల్లి గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.43.10 లక్షలు మంజూరు కాగా, యాలాల్ శాఖ గ్రంథాలయంలో మరమ్మతులకు రూ.4.75, జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.80 వేలు, కులకచర్లకు రూ.90 వేలు, పరిగికి ఐదు లక్షలు, బషీరాబాద్‌కు మూడు లక్షలు, పూడూర్‌కు రూ.లక్ష, పెద్దెముల్‌కు మూడు లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కోటి 50 లక్షల రూపాయల వేతనాలు ఇప్పించామని, ముగ్గురు ఉద్యోగులకు సంబంధించిన రూ.5.14 వేతనాలు త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. మూడు కోట్ల రూపాయలతో వికారాబాద్, తాండూర్ గ్రంథాలయ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ భవనంలో మంజూరయ్యే నిధులతో స్టడీ రూం, కాన్ఫరెన్స్ హాల్, పిల్లల విభాగం, రీడింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ప్రతి లైబ్రరీలో డిమాండ్ ప్రకారం కొత్త పుస్తకాలు తెప్పిస్తామని చెప్పారు. కోర్టు ఆదేశాలు రాగానే తాత్కాలిక ఉద్యోగులకు రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 84 పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉండగా మరో వంద ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతున్నామని అన్నారు.
దేశానికి రైతుబంధు ఆదర్శం
రైతుబంధు పథకం పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బీహార్, కర్నాటక రాష్ట్రాల్లోనూ రైతుబంధు అమలు మెనిఫెస్టోలో పొందుపర్చారని చెప్పారు. ప్రపంచంలోనే రైతుబంధు పథకం మొదటిసారిగా తెలంగాణలో అమలుచేశారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే విత్తనాలు, ఎరువులు ఇంటికి వచ్చేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే వచ్చే ఐదు లక్షల ఎల్‌ఐసీ బీమా డబ్బు కుటుంబానికి ఆసరాగా ఉంటుందని వివరించారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలలో రెండో విడత పెట్టుబడి రూ.4000లు ఇస్తారని, ప్రతిపక్షాలు విమర్శలు మాని విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. వికారాబాద్ జడ్పీటీసీ ముత్తార్ షరీఫ్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నిధుల గోల్‌మాల్?
కుషాయిగూడ, మే 21: ఇంజనీరింగ్ అధికారులే అవినితీ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కోట్ల ఆభివృద్ధి నిధులు గోల్‌మాల్ చేస్తున్నారనే ఆరోపణలు కాప్రా సర్కిల్ పరిధిలో వినిపిస్తున్నాయ. కాప్రా సర్కిల్ పరిధి కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మల్లాపూర్, నాచారం డివిజన్‌ల్లోని ఆభివృద్ధి పనుల్లో కోట్ల నిధులు గోల్‌మాల్ చేస్తున్న ఇంజనీరింగ్ విభాగం అధికారులు చూచిచూడన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. కాప్రా డివిజన్‌ల్లో ఆభివృద్ధి పనుల చేస్తున్న తమకు సమాచారం అందించడంలేదని కార్పొరేటర్.. ఇంజనీరింగ్ అధికారులతో మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నయి. కాప్రా సర్కిల్‌లో ఇంజనీరింగ్ అధికారులే ఆ నాలుగు కాంట్రాక్టర్లతో కుమ్మకై బినామీలుగా మారిపోయి కోట్లది నిధులు కాంట్రాక్టు టెండర్లు తక్కువ శాతనికి దక్కించుకుంటున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలల క్రితం కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు రూ.80 కోట్ల నిధులకు డివిజన్‌ల వారిగా ఏఈ స్ధాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చర్లపల్లి వీరాట్‌నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.42 లక్షలు ప్రతిపాదన చేయగా కాంట్రాక్టర్ దక్కించుకొని పనులు చేయడనికి వెళ్లగా ఇంతకు ముందే రోడ్లు ఉండడం ఖంగుతిన్నారు. కాప్రా డివిజన్‌లోని శ్మశాన వాటికలో 36 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ, పిచ్చిచెట్లను తీసివేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయగా టెండర్ పిలువడంలో భారీగా గోల్‌మాల్ జరిగిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో ఎక్కడా న్యాణత ప్రమాణాలు పాటించకున్నా అంతతానై వర్క్ ఇన్‌స్పెక్టర్లు అవినీతికి ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ.