రంగారెడ్డి

అక్రమ నిర్మాణాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 24: ఘట్‌కేసర్ పంచాయతీ బాలాజీనగర్‌లోని దేవర బాలాజీ భూముల్లో వెలసిన నిర్మాణాలను దేవదాయ శాఖ అధికారులు గురువారం కూల్చివేశారు. స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవర బాలాజీ ఆలయ భూములలో ఉన్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, చేపట్టీన నిర్మాణాలను తొలగించాలని గతంలో దేవాదాయ శాఖ ఈఓ భాగ్యలక్ష్మి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించని నిర్మాణాలను గురువారం ఉదయం జేసీబీలతో కూల్చివేతలు జరిపారు. నిర్మాణాలను కూల్చివేతలు జరుపుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, డైరక్టర్లు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్.. సంఘటన స్థలానికి చేరుకుని కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపే వేయాలని, త్వరలో తామే చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులతో వాదించారు. మాటను ఎంత మాత్రం పట్టించుకోకుండా కూల్చివేతలను యథావిధిగా కొనసాగించారు. పైసా, పైసా కూడ బెట్టుకుని, తమ పుస్తెలు అమ్ముకుని పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, వారి ఇళ్లను కూల్చటం వాయిదా వేయాలని కోరారు. అనంతరం ఈఓ భాగ్యలక్ష్మికి ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు.

చమురు ధరలను వెంటనే తగ్గించాలి
మేడ్చల్, మే 24: సామాన్యుల నడ్డివిరిచేలా అమాంతంగా పెంచిన చమురు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే తగ్గించాలని కోరుతూ గురువారం యువజన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్‌లో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. మేడ్చల్ హైవే వివేకానంద విగ్రహం వద్ద ప్రెటో మంటలను నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా, పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించకుండా బడుగు జీవులు భరించలేనంతగా భారాన్ని మోపుతూ పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పీ. లక్ష్మణ్ రావు, రేగు రాజు, రఘురాంరెడ్డి నాగని సాయి, నాగరాజు, శివ, ఆంజనేయులు, సాగర్, రాజు పాల్గొన్నారు.