రంగారెడ్డి

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 24: అకాల వర్షం కురవడంతో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి నీటిపాలైంది. గురువారం సాయంత్రం కురిసిన ఆకాల వర్షానికి షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్ యార్డు అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ, వాన లెక్కచేయకుండా పంటలను సాగుచేసుకొని ధాన్యం విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకువస్తే అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తే ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుకు వచ్చిన అన్నదాతలకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలా నుంచి వచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామానికి చెందిన భారతమ్మ అనే మహిళా రైతు మొక్క జొన్న ధాన్యం విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకురాగా అధికారులు కొనుగోలు చేయకపోవడంతో అరబెట్టారు. గురువారం సాయంత్రం వచ్చిన అకాల వర్షానికి మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోవడమే కాకుండా వరదకు కొట్టుకుపొయింది. దాంతో ఏమి చేయాలో తెలియక మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు వౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉరుములు, మెరుపులతో గాలి వాన
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన భారీగా కురిసింది. ఉక్కపోతలు, ఎండలతో ప్రజలు సతమతమవుతున్న తరుణంలో గురువారం సాయంత్రం వర్షం కురిసి వాతావరణంగా చల్లబడింది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ప్రతి రోజూ ఎండల వేడిమి, ఉక్కపోతలతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురవడంతో కొంతమేర వాతావరణం చల్లబడింది. నియోజకవర్గంలోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, రంగారెడ్డినగర్, సూరారం, సుభాష్‌నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ డివిజన్‌లతో పాటు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి, దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మరపోచంపల్లి గ్రామాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు బస్తీలు, కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉండంతో వరద నీరు, మురుగునీరు రోడ్ల పై చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
గాలి వానకు ఎగిరిపడిన ఇళ్ల పైకప్పులు
గాజులరామారం సర్కిల్ పరిధిలో గురువారం సాయంత్రం భారీ గాలివానకు ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. గాజులరామారం డివిజన్ దేవెందర్‌నగర్, బతుకమ్మ బండ, ఖైసర్‌నగర్ బస్తీలలోని సుమారు 13 ఇళ్ల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. విపరీతమైన గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వానకు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.