రంగారెడ్డి

కమ్మదనంకు కృష్ణమ్మ నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 23: మిషన్ భగీరథ ఫథకంలో భాగంగా కృష్ణానది నీళ్లు కమ్మదనం రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ సమీపంలో నిర్మించిన మిషన్ భగీరథ పథకం రిజర్వాయర్‌ను స్థానికులు భారీగా చేరుకొని సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమన్‌గల్ మండలం కరకల్ పహాడ్ మీదుగా కమ్మదనం రిజర్వాయర్‌కు కృష్ణానది నీళ్లు శనివారం ఉదయం వరకు చేరుకున్నాయి. కృష్ణానది నీళ్లు కమ్మదనం రిజర్వాయర్‌కు రావడంతో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రావడంతో షాద్‌నగర్ ప్రాంతానికి నీటి కష్టాలు తీరినట్లేనని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు పురపాలక సంఘంలోని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.260కోట్లు ఖర్చు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 100లీటర్ల తాగునీరు, పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 135లీటర్ల చొప్పున శుద్ధమైన తాగునీరు సరఫరా జరుగుతుంది. కమ్మదనం గ్రామం వద్ద 48ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుద్ధి చేసిన నీటిని పైపులైన్ ద్వారా వివిధ గ్రామాలకు సరఫరా చేయనున్నారు. కర్‌కల్ పహాడ్ నుంచి కమ్మదనం వరకు మొత్తం 42కిలో మీటర్లు ప్రధాన పైపులైన్ నిర్మాణం పనులు పూర్తి చేశారు.నీటి సరఫరా ద్వారా ఏమైన సమస్యలు తలెత్తితే అధిక మించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోనున్నారు. మొదటి దశలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 310గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయనున్నారు. 673కిలో మీటర్ల హెచ్‌డీపీఈ, డీఐ, డబ్ల్యుటీసీ పైపులైన్ నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయ. మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసేందుకు అవసరమయ్యే విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. కమ్మదనం రిజర్వాయర్ నుంచి తాండురు, అంతారం, కొడంగల్ వాటర్‌గ్రీడ్‌లకు సాధారణ కృష్ణాజలాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాగునీటి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న షాద్‌నగర్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. కృష్ణాజలాలు కమ్మదనం రిజర్వాయర్‌కు రావడంతో అటు ప్రజల్లో.. ఇటు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎంఎస్ నటరాజ్, పీ.వెంకట్ రెడ్డి, యుగంధర్, ప్రతాప్ రెడ్డి, మిషన్ భగీరథ డీఈ తిరుమలేష్ ఉన్నారు.