రంగారెడ్డి

ప్రయాణికుల సౌకర్యార్థమే బస్సుల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 24: ప్రయాణికుల సౌకర్యార్థమే ఆర్టీసీ బస్సుల పెంపు జరుగుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కేపీ వివేక్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బాచుపల్లి గ్రామం నుంచి కోఠి వరకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్సీ రాజుతో కలిసి వివేక్ ఆదివారం ప్రారంభించారు. వివేక్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతోనే నలబై ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపుతున్నానని అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆగం పాండు, కార్పొరేటర్ జగన్, నాయకులు ఆగం రాజు, సయ్యద్ సలీమ్, రాజెందర్ రెడ్డి, రామాగౌడ్, శంకరయ్య పాల్గొన్నారు.
సాయి అనురాగ్ కాలనీలో పార్కు పనుల పరిశీలన
బాచుపల్లి గ్రామం, సాయిఅనురాగ్ కాలనీలో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపీ వివేక్ పరిశీలించారు. ఆదివారం మార్నింగ్ వాకర్స్‌తో కలిసి వివేక్ మార్నింగ్ వాక్ చేశారు. మొక్కలను నాటారు. వివేక్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే పార్కులను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, ఆగం పాండు, సలీమ్, ఆగం రాజు పాల్గొన్నారు.
యోగా శిక్షణ తరగతుల ప్రారంభం
కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మానగర్ ఫేజ్-1లో మహేశ్వర యోగా శిక్షణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్ ప్రారంభించారు. స్థానికులతో కలిసి యోగా చేశారు. వివేక్ మాట్లాడుతూ ఒత్తిళ్లను జయించడానికి, ఉల్లాసంగా ఉండేందుకు యోగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో బాస్కర్ రాజు, బాస్కర్ గౌడ్, యోగాచార్యులు, ముకుంద రావు, మురళి, నాగేశ్వర రావు, సాయిగౌడ్, పద్మావతి, శాంత పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చాను

వనస్థలిపురం, జూన్ 24: ఎన్నికల్లో డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చినట్లు మన్సూరాబాద్ డివిజన్ రార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం డివిజన్ పరిధిలోని శ్రీనివాసపురం కాలనీ, విష్ణునగర్ కాలనీలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. విఠల్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికైన రెండేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రధాన సమస్యలను పరిష్కారం చేసినట్లు చెప్పారు. కార్పొరేటర్‌గా గెలిచినప్పుడు శివారు కాలనీలలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహించి ఎల్బీనగర్ అభివృద్ధికి సుమారు రూ.7 కోట్ల నిధులను కేటాయించినట్లు వివరించారు. ఎల్బీనగర్ తెరాస ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్, వార్డు కమిటీ సభ్యులు ఆనంద్ యాదవ్, వల్లపు అరుణ్ కుమార్ యాదవ్, బాల్ రాజు, నర్సింహా పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం

రాజేంద్రనగర్, జూన్ 24: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా పని చేస్తుందని కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం ఇన్‌చార్జి పీ.కార్తీక్ రెడ్డి అన్నారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రాజేంద్రనగర్‌కు చెందిన యువకులు యువజన కాంగ్రెస్ రాజేంద్రనగర్ సర్కిల్ అధ్యక్షుడు బీ.ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి గోపి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిని కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రాన్ని దోచుకునే ధోరణితో అధికారం చేపట్టారని అన్నారు. కేవలం నలుగురు కుటుంబ సభ్యులు పాలనలో చురుగ్గా పాల్గొంటున్నారని, మిగిలిన మంత్రులంతా రబ్బర్‌స్టాంప్‌లుగా పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనపై నమ్మకం సన్నగిల్లుతుందని పేర్కొన్నారు. యువకులు కాంగ్రెస్ బలోపేతానికి, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నాయకుడు, పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేసి సత్తా చూపాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డీ.రమేష్ ముదిరాజ్, సానెం శ్రీనివాస్ గౌడ్, ఎస్.ప్రమోద్ రెడ్డి, ఎన్.రాము, జీ.ప్రభాకర్, బీ.వెంకటేష్ పాల్గొన్నారు.