రంగారెడ్డి

జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 24: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని మాజీమంత్రి, భాజపా జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానికంగా భాజపా ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం.. రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. తమ పదవులను కాపాడుకునేందుకు, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకే తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, కేజీటూ పీజీ ఉచిత విద్య వంటి అనేక హామీలను ప్రజలపై గుప్పించి వాటిని నేడు పూర్తిగా విస్మరించారని అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పర్యావరణానికి, ప్రజలకు పెనుముప్పును తీసుకొచ్చే ఫార్మాసిటీని జిల్లాలో ఏర్పాటు చేస్తూ ప్రజల ప్రాణాలతో, ఈ ప్రాంత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్య పరిచేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జనచైతన్య యాత్రకు ఈ నెల 23వ తేదీన శ్రీకారం చుట్టారని చెప్పారు.
నల్గొండ జిల్లాలో ప్రారంభమైన యాత్ర నేడు ఇబ్రహీంపట్నంకు చేరుకుంటుందని, ఇక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశంలో భాజపా రాష్ట్ర నాయకులు బోసుపల్లి ప్రతాప్, నర్సింహారెడ్డి, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ నాయిని సత్యనారాయణ, బండి మహేశ్, బూడిద రాంరెడ్డి, తాళ్ళ వెంకటేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు ఇబ్రహీంపట్నంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నిర్వహించే జనచైతన్య యాత్రకు భాజపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మరథం పట్టాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అశోక్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు జనచైతన్య యాత్ర ఇబ్రహీంపట్నం చేరుకుంటుందని, ఖానాపూర్ గేటు సమీపంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.