రంగారెడ్డి
క్యాబ్ డ్రైవర్ నిజాయితీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 July 2018
జీడిమెట్ల, జూలై 17: ఓ వ్యక్తి క్యాబ్‌లో నగదును మరిచిపోగా క్యాబ్ డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. వరంగల్‌కు చెందిన కంచు కుమార్ కొంపల్లిలో నివసిస్తూ క్యాబ్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 16న సాయంత్రం కంచు కుమార్ క్యాబ్‌లో వైవీ అప్పారావు ప్రయాణించాడు. కాగా వైవీ అప్పారావు రూ1.25 లక్షల నగదు బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ కుమార్ మంగళవారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు నగదును అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. వైవీ అప్పారావును పిలిపించి ఆ నగదును అప్పగించారు. నిజాయితీని మెచ్చుకున్న వైవీ అప్పారావు, పేట్‌బషీరాబాద్ సీఐ రవిచంద్ర అభినందించి రూ.ఐదు వేల నగదును బహుమతిగా క్యాబ్ డ్రైవర్ కుమార్‌కు అందించారు.