రంగారెడ్డి

శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 16: శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. రామంతాపూర్‌లోని క్రైస్ట్ ది కింగ్ చర్చీ హైస్కూల్‌లో మధుర చారిటబుల్ ట్రస్టు సహకారంతో బాడీ బిల్డింగ్ అసోసియేషన్, సంతోష్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ తెలంగాణ ఓపెన్ బాడీ బిల్డింగ్ -2018 చాంపియన్‌షిప్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. క్రీడల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న విషయం మరిచిపోవద్దని పేర్కొన్నారు. ట్రస్టు చైర్మన్ రాగిడి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ట్రస్టు నిర్వహిస్తున్న సామాజిక సేవలను వివరించారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులను విద్యారంగంలో ప్రోత్సహిస్తూ వారికి అన్ని విధాలుగా చేయూతనిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. బాడీబిల్డింగ్ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 138మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. వీరిని 10గ్రూపులుగా బరువు ఆధారంగా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించారు. ర్యాంకులుగా విభజించి వీరికి ట్రోఫీ సర్ట్ఫికెట్లు, నగదు బహుమతులను అందజేశారు. బాలానగర్‌కు చెందిన కట్టకుమార్ చాంపియన్ ఆఫ్ చాంపియన్ మిస్టర్ తెలంగాణ 2018 టైటిల్‌ను దక్కించుకున్నారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌కుమార్, కార్యదర్శి మోహన్ రావు, స్యాప్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మిస్టర్ వరల్డ్ మోతీషాం అలీ, మిస్టర్ ఏసియా సంతోష్ కుమార్, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నీస్ నైనా జైస్వాల్, ఏసీపీ నర్సయ్య, ఉప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివా రెడ్డి. సీనియర్ కాంగ్రెస్ నేతలు షేక్ బుడేసాహెబ్, ఆర్‌ఎల్‌ఆర్ యువసేన, మధుర ట్రస్టు సభ్యులు నర్సింహా రెడ్డి, రవీందర్, రఫిక్, కరుణాకర్, ఆషు, సమ్మద్ పాల్గొన్నారు.
మున్సిపల్ సంప్‌కు చేరుకున్న భగీరథ నీళ్లు
షాద్‌నగర్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీళ్లు మున్సిపాలిటి సంప్‌కు చేరుకున్నారు. గురువారం షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న సంప్‌కు చేరుకున్న భగీరథ నీళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. షాద్‌నగర్ పురపాలిక సంఘంలోని 23వార్డులకు త్వరలోనే సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసి శుద్ధి చేసిన తాగునీటిని ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంటింటి స్వచ్చమైన తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
షాద్‌నగర్ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేసినట్లు వివరించారు. కమ్మదనం సంప్ నుండి పురపాలికలో ఉన్న సంప్‌కు నీళ్లు వస్తాయని, ఇక్కడి నుంచి పాత పైపుల ద్వారానే ఇంటింటికి తాగునీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలిక సంఘం కమీషనర్ శరత్‌చంద్ర, కౌన్సిలర్లు యుగంధర్, చింటు, టీఆర్‌ఎస్ నేతలు శ్రీ్ధర్‌రెడ్డి, ఎంఎస్ నటరాజ్‌లు ఉన్నారు.