రంగారెడ్డి

ఆర్టీసీ అధికారుల పనితీరుపై మంత్రి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 16: ప్రయాణికుల పట్ల ఆర్టీసీ అధికారులు అవలంభిస్తున్న విధానాలపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బైపాస్ మీదుగా వెళ్తున్న ప్రతి ఆర్టీసీ బస్సును షాద్‌నగర్ డిపోకు వచ్చి వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. షాద్‌నగర్ డిపో నుంచి సంగారెడ్డికి ఆర్టీసీ బస్సును నడిపించేందుకు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన దృష్టికి తీసుకువచ్చారని, అధికారులతో మాట్లాడి నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. షాద్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు ప్రతిరోజు 119బస్సులను రాకపోకలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థలం కేటాయించడంతోపాటు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మంత్రి మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. షాద్‌నగర్ ఆర్టీసీ బస్‌డిపోకు కొత్తగా 10నుంచి 15బస్సులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ 10పల్లె వెలుగు బస్సులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు, ప్రయాణికులు పాల్గొన్నారు.