రంగారెడ్డి

విద్యుత్ సరఫరాలో అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 17: కొద్ది నెలలుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎపుడుపడితే అపుడు కరెంటు పోవడంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పటి కంటే వర్షం, గాలి లేనపుడే కరెంటు సరఫరా నిలిచిపోతోందని వాపోతున్నారు. వర్షాకాలం కారణంగా ప్రధాన రహదారి మొదలు అంతర్గత రోడ్లన్నీ గుంతలమయం, బురదమయం కావడంతో అకస్మాత్తుగా కరెంటు పోవడం అంధకారంగా మారడంతో ఇళ్ళకు చేరాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వస్తోందని అంటున్నారు. జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఇంజనీర్‌లు ఉండే చోట విద్యుత్ సరఫరా అధ్వాన్నంగా ఉంటే మరి మారుమూల గ్రామాల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు.
నేతాజీ సంఘం అధ్యక్షునిగా రవీందర్
హయత్‌నగర్, ఆగస్టు 17: చంపాపేట్ డివిజన్ నేతాజీ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షునిగా బైగళ్ల రవీందర్, ఉపాధ్యక్షులుగా యాదగిరి, సాయికార్తీక్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు, కోశాధికారిగా సహదేవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీరాములు ఎన్నికయ్యారు. నేతాజి యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని అధ్యక్షుడు రవిందర్ తెలిపారు. తమ నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.