రంగారెడ్డి

పేదలకు నాణ్యమైన వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 15: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం షాద్‌నగర్ కమ్యూనిటీ వైద్యశాలలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో, ఆర్‌ఎంపీ డాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరాజ్యలక్ష్మీ మాట్లాడుతూ దగ్గు, దమ్ము, జ్వరం ఉన్న వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తే నేరుగా వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించిన ప్రతి కేసుకు రూ.500చొప్పున సర్కారు ఇవ్వనున్నట్లు తెలిపారు. దగ్గు, దమ్ము, జ్వరం కలిగిన వారిలో క్యాట్-1 కేటరిగి కింద నెల రోజుల పాటు మందులు రోగికి తినిపిస్తే రూ.వెయ్యి, క్యాట్-2 కింద ఎనిమిది నెలలు మందులు రోగికి తినిపిస్తే రూ.1500, మల్టిప్లెక్సీ కింద 24నెలల రోగికి మందులు తినిపిస్తే నెలకు ఐదువేలు ఇవ్వనున్నట్లు వివరించారు. దగ్గు, దమ్ము, జ్వరం కలిగిన రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తే పరీక్షలు, ఎక్స్‌రే తీసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు సూచించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగికి నెలకు అదనంగా రూ.500 ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలో వేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఐదు డెంగ్యూ కేసులు
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదు డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మీ తెలిపారు. కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక కేసు, చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక కేసు, షాద్‌నగర్ కమ్యూనిటీ వైద్యశాలలో మూడు కేసు కేసులు నమోదు అయినట్లు వివరించారు.
వాతావరణం చల్లగా ఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. ఫరూఖ్‌నగర్‌లో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా టీబీ అధికారిని అరుణకుమారి, డిప్యూటి డీఎంహెచ్‌ఓ చందునాయక్, షాద్‌నగర్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్థి పనులలో నాణ్యత పాటించాలి
కేపీహెచ్‌బీకాలనీ, అక్టోబర్ 15 :అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకిరామారాజు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సోసైటిలో 45 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ పనులను ఆయన పాల్గొని పరిశీలించారు. మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులలో నాణ్యత లోపిస్తే ఉరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్, నాయకులు భాస్కర్‌గౌడ్, రవి, రంగారాజు పాల్గొన్నారు.