రంగారెడ్డి

అసమానతలు అభివృద్ధికి అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 13: నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న అస్పృశ్యత, అసమానతలు దేశ ప్రగతికి అడ్డంకిగా మారాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఉప్పల్ రింగ్‌రోడ్డులో స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి శుభ్రం చేశారు. పూలమాలలతో నివాళులు అర్పించారు. అంబేద్కర్ చేసిన పోరాటాలు, బోధనలు ఎంతో స్పూర్తిదాయకమన్నారు. ఉగ్రవాదం వల్ల దేశం ఎంతో నష్టపోయిందని, ఇప్పుడది ప్రపంచానికి పెనుముప్పుగా మారిన నేపధ్యంలో అంబేద్కర్ స్వీకరించిన ఆచరించిన ప్రేమ, కరుణ, శాంతి, సర్వమాన సౌభ్రాతృత్వమే దేశానికి శిరోధార్యమన్నారు. భారతీయ జనతాపార్టీ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా గ్రామ గ్రామాన నివాళులు అర్పించి ఆయన జీవితం, జాతీయ సమగ్రతపై, ఆలోచన విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సామాజిక సమరసత, సామాజిక న్యాయం, సమానత్వంను పెంచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తుందన్నారు. సామాజిక అంతరాలను రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గురించి అవగాహన కల్పిస్తూ, అంబేద్కర్ జీవిత చరిత్ర, లక్ష్యాలకు సంబంధించిన సాహిత్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. గ్రామీణ విద్యార్థులను సన్మానించి వారిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సర్వ మానవాళికి ఆదర్శమూర్తి అయిన అంబేద్కర్‌కు బిజెపి నాయకత్వంలో నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో సత్కరించిందన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన ఘనం బిజెపి నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వానిదేనన్నారు. ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడే షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. 2015 నవంబర్ 26న రాజ్యంగ దివస్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ అంబేద్కర్ సేవలకు విశేష ప్రాచర్యం కల్పించిందన్నారు. అంబేద్కర్ జీవితంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన ఐదు స్థలాలను పంచతీర్థాలుగా తీర్చిదిద్దేంకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. వీటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వివరించారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా 2.50లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్యాహిక వేత్తలను తయారు చేయడానికి కేటాయించి పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యాన్ని కల్పించిన ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దళితుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు జి.విజయలక్ష్మి, మీసాల చంద్రయ్య, మాంకాల లక్ష్మణ్, యుబి చారి, తిండేరు హన్మంతారావు, పర్వేష్‌సింగ్, దేవసాని బాల్‌చందర్, గోనె అంజయ్య, కొంపల్లి మధు పాల్గొన్నారు. అంతకు ముందు డాక్టర్ లక్ష్మణ్‌కు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్,లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు.

100 సంవత్సరాల చరిత్ర విద్యా హక్కు చట్టానిది

వికారాబాద్, ఏప్రిల్ 13: విద్యా హక్కు చట్టానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని విద్యాహక్కు వేదిక రాష్ట్ర కన్వీనర్, జాతీయ వేదిక సభ్యుడు మురళీమోహన్ అన్నారు. బుధవారం స్థానిక బవార్చి కాన్ఫరెన్స్ హాలులో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యాహక్కు చట్టం బలోపేతం తదితర అంశాలపై ఏర్పాటుచేసిన ఒకరోజు వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు వచ్చినా, పోరాటాలు, ఉద్యమాలు జరిగినా నేటికీ బాల కార్మికులు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలోనే లక్షా 50 వేల మంది బాల కార్మికులుండగా, రంగారెడ్డి జిల్లాలో 75 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 55 వేల మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు హక్కులు కల్పిస్తున్నది చెప్పుకోవడానికే తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు. సమగ్రంగా అభివృద్ధి చెందేందుకే ప్రజలు హక్కులను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులపైనే కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది తప్ప ఆదేశిక సూత్రాలపై వెళ్ళేందుకు అవకాశం ఉండబోదని అన్నారు. ప్రతి హక్కు ఆర్థిక సంబంధాన్ని కలిగి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బాలకార్మికులు లేరని ఎద్దేవా చేశారు. హక్కు లేకుంటే చట్టపరంగా కొట్లాడేందుకు అవకాశం ఉండబోదని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి మహిళలకు ఇచ్చిన టికెట్ల శాతం కేవలం మూడు మాత్రమేనని పేర్కొన్నారు. 1986లో పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన విద్యాహక్కు చట్టంపై చర్చ జరగలేదని అన్నారు. విద్యాహక్కు చట్టంపై సిఎం వ్యతిరేకంగా లేరని, కెజి టు పిజి విద్యకు నిధుల విషయం బహిర్గతం చేయాలని ప్రశ్నించారు. ప్రైవేటుపై మోజు కారణంగానే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడంలేదని, అవి మూత పడుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చందర్ నాయక్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం రక్షణలో భాగంగా ఎలాంటి సమస్యను తన దృష్టికి తెచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్ మాట్లాడుతూ సిఎం కేసిఆర్ విద్యాహక్కు చట్టాన్ని దరిద్రమైనదని అనడం సరికాదని అన్నారు. మహిత స్వచ్చంద సంస్థ డైరక్టర్ రమేష్ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి వెళ్ళే డైస్ నివేదిక సరైన విధంగా లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సిఆర్‌పిఎఫ్ జిల్లా కన్వీనర్ శివరాజ్, మహిత జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ టి.రాధాకృష్ణ, జోనల్ కోఆర్డినేటర్ టి.సుదర్శన్, జిల్లా విద్యారక్షణ కోఆర్డినేటర్ కె.బ్రహ్మం, అనిత, సిబ్బంది రాములు, యాదయ్య, కాశయ్య, సువర్ణ, దాసు, అజీం, పద్మ, మంజుల, శశిరేఖ, బాలయ్యలు పాల్గొన్నారు.