రంగారెడ్డి

గుండెల్లో గుబులు.. విజయం కోసం దిగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 10: ముందస్తు ఎన్నికల సమరభేరి మోగిన నాటి నుంచి తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న ఎన్నికల వాడివేడి గత శుక్రవారం 7న ముగిసిన పోలీంగ్ ప్రధాన ఘట్టంతో సద్దుమణిగింది. గడిచిన నాలుగు రోజులుగా నియోజకవర్గంలో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులతో పాటు, మరో 9 మంది చిన్నా చితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లోని ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. దాదాపు రెండు నెలల కాలంగా కొనసాగిన ఎన్నికల హోరా హోరీ ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన ప్రధాన అభ్యర్థులకు తోడు మరో 9 మంది గుండెల్లో గుబులు, గెలుపు కోసం దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఓట్ల లెక్కింపు క్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్యనే హోరా హోరీ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, బీజేపీ అభ్యర్థి పటేల్ రవిశంకర్ ఓట్ల లెక్కింపులో తృతియ స్థానంలో ఉంటారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పంజుగుల పైలెట్ రోహిత్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి ఓట్ల లెక్కింపు క్రమంలో నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడుతారన్న వాదనలు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
తాండూరు నియోజకవర్గంలో రాజకీయ మార్పును కోరుతున్న మెజారిటీ ప్రజానీకం ఆశలు నెరవేరి కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి విజేతగా నిలుస్తారా.. లేక టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మరోసారి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటారా అనే మీమాంస తాండూరు నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. ఈనేపథ్యంలో గెలుపు కోసం పై రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు కళ్లల్లో వత్తులు వేసుకొని గెలుపు కోసం ఆరాట పడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు తాండూరు ఎన్నికల సమరంలో తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆరు నూరయినా విజయం తమదే అనే వాదనలు ఇరు పార్టీల నాయకులు వినిపిస్తుండగా, తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీ ఎన్నికల పోరులో తనదైన శైలిని ప్రదర్శించిన బీజేపీ అభ్యర్థి పటేల్ రవిశంకర్ సైతం ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మూడవ స్థానంలో ఉంటూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల భవతవ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తూ పై రెండు పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై కీలకంగా మారనున్నట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.
తాండూరు రాజకీయ చరిత్రను ఎన్నికల ఫలితాలు మార్చబోతున్నాయా?
ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు, ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నియోజక వర్గంలోని ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు, ప్రజలు తాము ఇంత కాలం ఎదురు చూస్తున్న రాజకీయ మార్పు సాధ్యమవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గడిచిన ఇరవై నాలుగేళ్ల కాలంలో ఒకసారి 2004 ఎన్నికల్లో మినహా వరుసగా ఓకే వ్యక్తి(పట్నం మహేందర్ రెడ్డి) ఆధిపత్యంలో కొనసాగుతున్న తాండూరు రాజకీయాలలో ఈసారీ రాజకీయ మార్పు అనివార్యం కానుందా అనే ఆశలు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాల ప్రతి నిధుల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే రాజకీయ వ్యక్తి ప్రాబల్యం తాండూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న తరుణంలో ముందస్తు ఎన్నికలు రావటంతో ఈసారి ఎన్నికల్లో తాండూరులో రాజకీయ మార్పును ఆశిస్తూ దాదాపు అన్ని వర్గాల ప్రజలు, టీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి తాండూరులో మహేందర్ రెడ్డి రాజకీయ పెత్తనానికి అడ్డుకట్ట వేశాయ. అందుకు అనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సైతం ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిశలు పాటు పడ్డారు. తాండూరులో వేళ్లక పోయిన వలసవాది స్థానికేతరుడు అయిన గొప్ప రాజకీయ చతురతుడిగా తాండూరు నియోజకవర్గంతో పాటు, పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో పేరుగాంచిన పట్నం మహేందర్ రెడ్డిని ఈసారి ఎన్నికల్లో మట్టి కరిపించాలనే పట్టుదల తాండూరు నియోజకవర్గం రాజకీయుల్లో నెలకొన్న సంగతి అందరికి విధితమే. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు తాజా ఎన్నికల్లో పావులు కదిపారు. ఇంత కాలం తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల తరపున మాజీ మంత్రి పట్నంకు గట్టి పోటీని ఇచ్చే నేతలు లేకపోవడం, తాండూరు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, వర్గ పోరాటాలు గడిచిన మూడు నాలుగు ఎన్నికల సందర్భాల్లో పోడచూపటంతోపాటు, మూడో ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ తరపున గట్టి అభ్యర్థులు లేకపోవటం వంటి అంశాలతో తాండూరులో మహేందర్ రెడ్డి ఆధిపత్యం పరంపరగా సాగుతూ వచ్చింది. తాజా ఎన్నికల ఫలితాలతో తాండూరులో రాజకీయ మార్పు అనివార్యం అనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. తాండూరులో రాజకీయ మార్పు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య భవితవ్యం బట్ట బయలు కానుంది.