రంగారెడ్డి

మున్సిపల్ ఎన్నికల సమరానికి అధికారుల కసరత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికార యంత్రాంగం ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ అధికారులు ఎన్నికల సమరానికి ఏర్పాట్లు ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించి మున్సిపల్ డైరెక్టర్ గత అక్టోబర్‌లో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ వార్డుల విభజన ప్రక్రియలో అధికారులు, సిబ్బంది తల మునకలయ్యారు. శాసన సభ ఎన్నికల పర్వం ముగిసి ముగియగానే మున్సిపల్ ఎన్నికల నిర్వాహణ అంశం పై ఉన్నతాధికార యంత్రాంగం సూచన ప్రాయంగా ఆదేశాలు వెలువరించటం గమనార్హం. ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. పట్టణ శివార్లలో ఉన్న పలు గ్రామీణ ప్రాంతాలను, స్థానిక రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టీఆర్ నగర్, విజయనగర్ కాలనీలతో పాటు, సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, రసూల్‌పూర్ తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తుండటంతో ఆయా ప్రాంతాలను ప్రస్తుత మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో విలీనం చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా స్థానిక మున్సిపల్ అధికార గణం ప్రస్తుతం ఉన్న 31 మున్సిపల్ వార్డులలోనే కొత్త ప్రదేశాలను విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. నూతనంగా మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే యాలాల మండల పరిధిలో ఉన్న రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీ, రసూల్ పూర్‌లతో పాటు, తాండూరు మండలం అంతారం గ్రామ పరిధిలో ఉన్న ఎన్‌టిఆర్ కాలనీ, విజయనగర్ కాలనీలను నూతన వార్డులుగా విభజించాలని ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపు 5 నుంచి ఆరువేల మంది ప్రజలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ పరిపాలన ఉన్నతాధికార యంత్రాంగం మాత్రం తాండూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 31 వార్డులను యథావిధిగా కొనసాగిస్తూ నూతనంగా మున్సిపల్ పరిధిలోకి వస్తున్న ఆయా కాలనీలు, గ్రామాలను ఈ 31 వార్డులలోనే సర్దుబాటు చేయాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నట్లు స్థానిక మున్సిపల్ అధికారులు, కమిషనర్ పీ.్భగేశ్వర్లు సమాచారం బట్టి తెలుస్తోంది. తమ కాలనీలు, గ్రామాలను మున్సిపల్ పరిధిలోకి తేస్తే నూతనంగా వార్డుల విభజన చేయాలన్న డిమాండ్‌లను ఆయా ప్రదేశాల ప్రజలు పునరుద్గాటిస్తున్నారు. మల్‌రెడ్డిపల్లి, ఎన్‌టీఆర్ నగర్, విజయనగర్ కాలనీలను వార్డు నెంబర్ 7లో విలీనం చేస్తూ, సాయిపూర్, రసూల్‌పూర్ వార్డు నెంబర్ 9లో, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలను వార్డు నెంబర్ 8లో విలీనం చేసేలా అధికారులు తమ కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. నూతన కాలనీలను మున్సిపల్‌లో విలీనం చేస్తూనే, కొత్తగా మరో ఐదు ఆరు వార్డులు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు, స్థానిక రాజకీయులు, మున్సిపల్ కౌన్సిలర్‌లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తమ వాదనలు వినిపిస్తున్నారు.

వసతి గృహంలో అగ్ని ప్రమాదం
జీడిమెట్ల, డిసెంబర్ 17: అర్బన్ వసతి గృహంలో మంటలు చేలరేగిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని దూలపల్లి గ్రామంలో అర్బన్ వసతి గృహం నిరుపయోగంగా ఉంది. సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హాస్టల్‌లోని ఫర్నిచర్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.