రంగారెడ్డి

మళ్లీ మొదటికొచ్చిన మిలటరీ రోడ్ల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, మే 7: కంటోనె్మంట్‌లో మిలటరీ రోడ్ల మూసివేత అంశం తిరిగి మొదటికి వచ్చింది. రెండు సంవత్సరాలుగా రోడ్ల మూసివేత అంశంపైన చర్చలు ప్రతి చర్చలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగినా ఫలితం లేకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూన్ ఒక్కటి వరకు సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే ప్రజాసంఘాలు ప్రజలు తమ తమ అందోళనలు ఉదృతం చేసి సభలు సమావేశాలు నిర్వహిస్తు తమ నిరసనలు తెలియజేస్తు ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నారు. రోడ్ల మూసివేత అంశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిహెచ్‌ఎంసి, కంటోనె్మంట్ బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు విమర్షిస్తున్నారు. మిలటరీ అధికారులు 10 సంవత్సరాలుగా సికింద్రబాద్ కంటోనె్మంట్ ప్రాంతంలో మిలటరీ స్థలాలు ప్రయివేటు వ్యక్తుల చేత అక్రమణలకు గురైన వాటిపైన శ్రద్ధ పెట్టి వాటిని తిరిగి స్వాధీనం చేసుకనే పని చేస్తున్నారు. మిలటరీ ప్రాంతంలోని ఖాళీగా ఉన్న స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించటం, ఉన్న ప్రహరీ గోడల ఎత్తును పెంచటం చేస్తున్నారు. తిరుమలగిరి, టీచర్స్ కాలనీ, మారెడ్‌పల్లి, తిరుమలగిరి గాంధీనగర్, బోల్లారం, ఓల్డు బోయిన్‌పల్లి, ఫెరోజ్‌గుడా, బోయిన్‌పల్లి నందమూరినగర్, కౌకూర్‌లో మిలటరీ స్థలాలకు సంబంధించిన వివాదం సాగుతుంది. బస్తీలు మర్డ్ఫుర్డు , మారెడ్‌పల్లిలోని 108 బజార్, బోల్లారంలోని కళాసిగుడ, సెంట్రల్ బ్యాటరీ బస్తీలు మిలటరీ స్థలాల్లో ఉన్నాయని, వాటిని వెంటనే ఖాళీ చేయ్యాలని బస్తీ ప్రజలను మిలటరీ అధికారులు హెచ్చరించడం, వెంటనే ప్రజాప్రతినిధులు చర్చలు జరపడం.. తాత్కాలికంగా నిలిచిపోయి సంబంధిత అధికారి బదిలీపైన వెళ్లిన తర్వాత మరో అధికారి వచ్చిన వెంటనే మళ్లీ కథ మొదటికి వస్తుంది. ప్రస్తుతం కంటోనె్మంట్ బోర్డులో ఇల్లు నిర్మించుకోవాలంటే కంటోనె్మంట్ అధికారులు, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు ఎలాంటి భూవివాదాలు లేవనీ ధ్రువీకరిస్తేనే మిలటరీ అధికారులు అనుమతిస్తున్నారు. ఈ అంశాన్ని కంటోనె్మంట్ బోర్డు సభ్యులు ఎంతగా వ్యతిరేకించినా మిలటరీ అధికారులు ససేమిరా అంటున్నారు. మరో వైపు రోడ్ల వివాదం రెండు సంవత్సరాలుగా గళ్లీ నుండి ఢిల్లీ వరకు చర్చలు ప్రతి చర్చలు జరుగుతున్నా ఫలితం రావటంలేదు. అన్ని తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఆరుమాసాలకు ఒకసారి రోడ్ల మూసివేత వాయిదా వేస్తు వస్తున్నారు. ప్రభుత్వం ఎన్నో రకాలైన సమస్యలు పరిష్కరిస్తున్నా కంటోనె్మంట్‌లో మిలటరీ రోడ్లను మూసివేతపైన అంతగా స్పందించటం లేదు. స్థానికలు కోర్టుకు వెళ్లగా హైదరాబాద్‌లోని జిహెచ్‌ఎంసి అధికారులు కంటోనె్మంట్, మిలటరీ అధికారులతో కలిసి ప్రజలకు ప్రత్యామ్నాయ రోడ్ల వేసి వారికి ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. కానీ, ఇక్కడ జిహెచ్‌ంసి అధికారులకు కంటోనె్మంట్ అధికారులకు సమన్వలోపంతో పనులు ముందుకు సాగంలేదు ప్రధానంగా కంటోనె్మంట్ మీదుగా ఏఒసి గేట్ నుంచి సఫిల్‌గుడకు వెళ్లే మార్గం, ఈస్టుమారెడ్‌పల్లి నుంచి ఏఒసి సర్కిల్ మీదుగా రామకృష్ణపురం ప్రధాన రహదాలు, వాటికి అనుబంధ రోడ్లు మూసి వేయాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రధాన రోడ్లు చాల కీలకమైనవి మల్కాజిగిరి, సఫిల్‌గుడ, వౌలాలి, ఇసిఐఎల్, ఎయస్‌రావునగర్, కాప్ర, నేరెడ్‌మెట్, మల్కాజిగిరి, కాప్రా పాత మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలు సికింద్రాబాద్‌కు రావాలంటే ఇదే ప్రధాన మార్గం. రోడ్లు మూసివేతతో దాదాపుగా ఓల్డు మల్కాజిగిరి, మిర్జాలగుడ, మెట్టుగుడ మీదుగా రైల్వే నిలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండో దారి నిర్మల్‌నగర్ డిఫెన్స్ కాలనీ, భవన్స్ కళాశాల మీదుగా 1ఇఎంఇ మిలటరీ సెంటర్ ద్వార నాగదేవతగుడి మీదుగా తిరుమలగిరి చేరుకోవటం, లేదంటే 1ఇఎంఇ నుంచి బొల్లారంలోని రాష్టప్రతి నిలయం నుంచి మల్లారెడ్డి కాలనీ ద్వార లోతుకుంట అంబేద్కర్ విగ్రం సర్కిల్‌కు చేరుకోవటం. కానీ, రెండు మర్గాలు నగరంలోని ట్రాపిక్ దృష్ట్య అనువైనవి కాదని పరిశీలకు భావిస్తున్నారు. మిలటరీ అధికారులు మూసివేస్తామంటుంన్నది భద్రత కారణాల వల్లానా? రోడ్ల పాడైపోయి మెయింటనెన్స్ వల్లానా? స్థలాలు కబ్జా అగుతున్నాయని నిలిపి వేస్తున్నారా? అనే అంశాలు స్పష్టం కావడం లేదు. సాధారణ ప్రయాణికులకు భద్రత కల్పించలేని స్థితిలో మిలటరీ అధికారులు ఉన్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
రోడ్ల మూసివేతపై ఫలించని ప్రభుత్వ రాయబారం
రోడ్ల మూసివేత అంశంపై అన్ని రాజకీయ పార్టీలది ఒకే బాట. స్థానిక ఎమ్మెల్యే జి.సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు చాలకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి తలనొప్పిగా మారింది. తెరాస, టిడిపి, బిజెపి పార్లమెంట్ సభ్యుల బృందం, కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి రోడ్లు యథాస్థితిలో కొనసాగించాలని కోరారు. డిసెంబర్ 15న కేంద్రమంత్రి పారికర్.. ఫిబ్రవరి 2016న కంటోనె్మంట్‌లోని మిలటరీ రోడ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ప్రకటనలు చేశారు. కానీ, కార్యరూపం దాల్చలేదు. దీంతో డిసెంబర్‌లో పేర్కొన్న ఆరు మాసాల గడువు జూన్ 1కి ముగియటంతో రోడ్లు మూసివేత అంశం మొదటికి వచ్చింది. రెండు రోజుల క్రితమే కేంద్రానికి మంత్రి కెటి రామరావు రోడ్ల మూసివేత అంశంపై లేఖ రాసారు.