రంగారెడ్డి

రూ.12 కోట్లతో పటేల్ చెరువు సుందరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12: కబ్జాల నుంచి చెరువులను కాపాడి సుందరీకరిస్తామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్ పటేల్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను కబ్జాల నుంచి రక్షించి వాటిని సుందరీకరిస్తామని చెప్పారు. పటేల్ చెరువును రూ.12 కోట్లతో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, ప్రజా మరుగుదొడ్లను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే వివరించారు. చెరువుల్లోకి కలుషిత నీరు రాకుండా సంరక్షిస్తామని, మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, నాయకులు ఎం.రాజు యాదవ్, ఆర్.రఘునాథ్, పోతుల రాజేందర్ ఉన్నారు.
దేవాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి
హయత్‌నగర్, ఫిబ్రవరి 12: కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్లాస్టిక్ వాడకుండ అందరు బాధ్యతగా వ్యవహరించాలని ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ అన్నారు. దేవాలయంలో మంగళవారం ఆలయ చైర్మన్ కోతినర్సి రెడ్డి, ఈవో అన్నపూర్ణ, ధర్మకర్తలతో కలిసి స్వచ్ఛ భారత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆలయంలో ప్రసాదాలు తీసుకునే కవర్లు, ఇతర చెత్తాచెదారాన్ని విధిగా చెత్తడబ్బాలోనే వేయాలని అన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా వేయడం వలన రీ సైక్లింగ్ చేయవచ్చని సూచించారు. నగరంలో నిత్యం 5,200టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ఆలయ కమిటీ కోరిక మేరకు ఆలయంలోని చెత్తను తరలించేందుకు చెత్త ఆటోలతో పాటు చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ సేవా ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు డీసీ విజయకృష్ణ, చైర్మన్ నర్సిరెడ్డి, ఈవో అన్నపూర్ణ, ఏఎంహెచ్‌వో మల్లికార్జున్‌లకు గో గ్రీన్ సర్ట్ఫికేట్లను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు వెంకట్‌రెడ్డి, వేణుగోపాల రావు, దుర్గారెడ్డి, ఈశ్వరయ్య గౌడ్, గోపాల్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి, ఇందిరా, సిబ్బంది సంతోషి, మంజుల, మధుసాగర్, వేణు, రాంబాబు పాల్గొన్నారు.