రంగారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 25: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎంపి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. మేడ్చల్ మండలానికి ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల కోసం ఐదున్నర కోట్లు కేటాయించినట్లు ఎంపి వివరించారు. త్వరలో మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్ మండలాలకు కూడా నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. దశలవారీగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంలోకన్న అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదని అర్హులందరు వీటిని సద్వినియోగం చేసుకుని లబ్దిపొందాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మేడ్చల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఎంపి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం అభినందనీయమని కొనియడారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృతనిశ్చయంతో కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే తాగునీటి సమస్య తీర్చేందుకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా పైపులైన్ల ఏర్పాట్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భంలో నీటి నిల్వలు పెరిగి తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ప్రపంచ మొత్తం ప్రశంసిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతుందని అన్నారు. రుణమాఫీ, కళ్యాణలక్ష్మీ వంటి పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చుడాలన్నారు. అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వం మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. డబిల్‌పూర్ గ్రామంలో ఇంకుడు గుంతల పనులను వారు ప్రారంభించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలో కోటి 42 లక్షలు, గౌడవెల్లిలో రూ. 40 లక్షలు, రాయిలపూర్‌లో రూ. 28 లక్షలు, శ్రీరంగవరంలో రూ. 10 లక్షలు, నూతన్‌కల్‌లో రూ. 21 లక్షలు, డబిల్‌పూర్‌లో రూ. 50 లక్షలు, ఏల్లంపేట్ రూ. 20 లక్షలతో సిసి రోడ్డులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపి, ఎమ్మెల్యేలు ప్రారతభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి శైలజ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు రాజమల్లారెడ్డి, మాధవి, వరలక్ష్మీ, ఈశ్వర్, ఎంపిటిసిలు అమరం మోహన్‌రెడ్డి, నీరుడి లావణ్యకృష్ణ, స్వామి, ఆయా పార్టీల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ యాదవ్, మర్రి నర్సింహ్మరెడ్డి, శేఖర్‌గౌడ్, భాగ్యరెడ్డి, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహయం, జెఎసి చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ సేవలు చిరస్మణీయం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సేవలు చీరస్మణీయమని.. తెలుగు జాతి కీర్తిప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఎంపి మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహన్ని ఎంపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌అని గుర్తుచేశారు. ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుతూ ఆయన ఆశయ సాధనకు కంకణబద్ధులై పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటిసి శైలజ, పట్టణ టిడిపి అధ్యక్షుడు మర్రి నర్సింహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్, మే 25: నియోజకవర్గంలోని గ్రామాలను పర్యటిస్తూ టిఆర్‌ఎస్ కార్యకర్తల చిన్నచిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకెళతామని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక గౌలికర్ ఫంక్షన్ హాలులో మండల పార్టీ అధ్యక్షుడు బి.వెంకటయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ మండల పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకోవాలని సూచించారు. ఐదు నెలల్లోనే ఈ ప్రాంత ప్రజలు సంతోషపడే విధంగా వికారాబాద్ జిల్లా కేంద్రంతో కూడిన జిల్లా ప్రారంభం కానుందని చెప్పారు. ఎవరేమి చెప్పినా వికారాబాద్ జిల్లా ఏర్పాటు ఖాయమని, ఇటీవలే కోర్టుల భవన నిర్మాణం కోసం కలిసేందుకు సిఎం కేసిఆర్ వద్దకు వెళ్ళగా స్వయంగా ఆయనే వికారాబాద్ జిల్లా కేంద్రం కాబోతుందని చెప్పారని గుర్తుచేశారు.
వికారాబాద్ ప్రాంతంలో అన్ని కులాలవారు పేదవారే ఉన్నారని, భూములు అమ్ముకోవద్దని జిల్లా కేంద్రమైతే భూముల ధరలు పెరుగుతాయని, అప్పటివరకు మంచి పంటలు పండించుకోవాలని సూచించారు. ఐదు నెలల తర్వాత టిఆర్‌ఎస్ కార్యకర్తలకు సైతం పనులు దొరికేలా సిఎం కేసిఆర్ నిధులు కేటాయించనున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పెత్తనమే ఉండాలని, ఇతర పార్టీలవారు రాజకీయం చేస్తే సహించేది లేదని వారి సంగతి చూస్తామని, టిఆర్‌ఎస్ వారికి సహకరిస్తామని అన్నారు. రాష్టమ్రేర్పడి రెండు సంవత్సరాలైన సందర్భంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.
టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు అభివృద్ధి చెందితేనే పార్టీకి మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పటి టిఆర్‌ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిందని చెప్పారు. జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు టిడిపి, కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టు పార్టీలకు లేదని తెలిపారు. అన్ని పార్టీల సిఎంలు వికారాబాద్ జిల్లా ఇస్తామని ప్రకటించి మాట తప్పారని, సిఎం కేసిఆర్ మాత్రం మాట నిలబెట్టుకున్నారని అన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వికారాబాద్‌కు దక్కాల్సిన పార్లమెంటు స్థానాన్ని చేవెళ్ళకు తన్నుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌కు అన్యాయం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీల సభ్యత్వం కలిగిన 78 మందికి రంగారెడ్డి జిల్లాలో బీమా డబ్బులు అందాయని, వికారాబాద్ నియోజకవర్గంలో మర్పల్లి సహా పదిమందికి వచ్చాయని వివరించారు. బీమా డబ్బుల క్లెయిమ్‌కు తెలంగాణ భవన్‌లో కౌంటర్ ఏర్పాటు చేశారని చెప్పారు. కొత్తగా మండలాల ఏర్పాటు, మండల కేంద్రాలకు దూరంగా ఉండి ఇతర మండలాలలో విలీనం కోసం తెలంగాణ భవన్‌లో ఆయా గ్రామస్తులు వినతిపత్రాలు సమర్పించవచ్చని సూచించారు. ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు త్వరలో మంచి రోజులు రానున్నాయని అన్నారు. ఐదు పార్టీలు ఏకమైనా ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.
వికారాబాద్ ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి మాట్లాడుతూ పార్టీ సమావేశాలకు మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు. జడ్పిటిసి ముత్తహర్‌షరీఫ్ మాట్లాడుతూ వికారాబాద్ ఎమ్మెల్యే ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటున్నారని, సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని సిఎంకు తెలుసన్నారు. టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య మాట్లాడుతూ పార్టీలో పాత, కొత్తవారు సమన్వయంతో ఉండాలని సూచించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ, మండలంలోని పీరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఆగడాలకు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బలవుతున్నారని కట్టడి చేసినా లాభం లేకపోయిందని చెప్పారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు పలు విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముజఫర్‌షరీఫ్, మద్గుల్‌చిట్టంపల్లి గోపాల్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షుడు యాదగిరియాదవ్, మాజీ జడ్పిటిసి పి.శ్రీనివాస్, మైనార్టీసెల్ కార్యదర్శి బందెల్లి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, శంకరయ్య, ఖాజ, ఎంపిటిసి సాయన్న, ధ్యాచారం సర్పంచ్ లక్ష్మయ్య, పీరంపల్లి గణపతిరెడ్డి, రాములునాయక్, ధ్యాచారం నర్సింలు, మదన్‌పల్లి రాంరెడ్డి, వైస్‌ఎంపిపి అనంతయ్య పాల్గొన్నారు.

క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల దాడులు
కెపిహెచ్‌బికాలనీ, మే 25: రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై వేరువేరుచోట్ల కెపిహెచ్‌బి పోలీసులతో పాటు మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి సిబ్బంది దాడులు నిర్వహించి తొమ్మిది మంది వ్యక్తులతో పాటు రూ.7 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ల్యాబ్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేట్ రోడ్డులోని బండారి లేఅవుట్‌లో భీమవరంకు చెందిన కిషోర్ అనే నిర్వాహకుడు ఆధ్వర్యంలో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా కెపిహెచ్‌బి పోలీసులు స్థావరాలపై దాడి చేసి కిశోర్‌తో పాటు సుబ్రమణ్యరాజు, రఘురాం, రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.3 లక్షల నగదుతో పాటు 3 సెట్‌ఆఫ్ బాక్స్‌లు, 41 సెల్‌ఫోన్స్, 3 ల్యాబ్‌టాప్స్, రహస్య కోడ్ గల పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, వసంత్‌నగర్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన అనిల్, సురేష్, ప్రశాంత్, నందకుమార్, అశోక్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.4 లక్షల 27వేల నగదుతో పాటు 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను కెపిహెచ్‌బి పిఎస్‌కు అప్పగించారు.

బాచుపల్లి, నిజాంపేట్‌లో గోదావరి జలాల సరఫరా
జీడిమెట్ల, మే 25: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి బాచుపల్లి, నిజాంపేట్ గ్రామాలు ఆనుకుని ఉన్నాయి. కానీ, ఏళ్ల తరబడి ఈ గ్రామాలకు మంజీరానీరు సరఫరా లేదు. దీంతో గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్న ఈ గ్రామాలలో నీటి కోసమే ప్రతి నెల లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సిన దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఇరు గ్రామాల పాలకవర్గంతో పాటు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గోదావరి జలాలను తీసుకువచ్చారు.
నిజాంపేట్ గ్రామంలో వారం రోజులుగా గోదావరి జలాలు సంపునకు చేరుకుని అక్కడి నుండి వాటర్ ట్యాంకర్‌ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. బాచుపల్లి గ్రామంలో సైతం నిజాంపేట్ సంపు నుండి వాటర్ ట్యాంకర్‌ల ద్వారా మూడు రోజులుగా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఈ రెండు గ్రామాల్లో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుండేవారు. నిజాంపేట్ గ్రామంలో ప్రతి నెలా నీటి కొనుగోలుకు రూ.12 నుండి 14 లక్షల వరకు బిల్లులు చెల్లిస్తుండేవారు. బాచుపల్లి గ్రామంలో సైతం నీటి కొనుగోలుకు లక్షల రూపాయల బిల్లులను చెల్లిస్తుండేవారు. గోదావరి జలాలు ఎట్టకేలకు రావడంతో నీటి కొనుగోలు బిల్లుల భారం గ్రామ పంచాయతీలకు తగ్గినట్లే. ప్రతి నెల 12 నుంచి 14 లక్షలు అంటే ప్రతి సంవత్సరం కేవలం నీటి కొనుగోలు దాదాపుగా 20 లక్షలు ఖర్చు ఒక్కో గ్రామానికి అయ్యేది.
రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ సహకారంతో బాచుపల్లి, నిజాంపేట్ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిల కృషితో గ్రామానికి గోదావరి జలాలను తెచ్చుకున్నారు. ప్రతిరోజు నిజాంపేట్ గ్రామంలో ఐదు గోదావరి జలాల వాటర్ ట్యాంకర్‌లు సరఫరా జరిగితే 20 వాటర్ ట్యాంకర్‌లు బోర్ నీరు సరఫరా జరుగుతుంది. బాచుపల్లి గ్రామంలో సైతం సుమారు 10 నుంచి 15 వరకు వాటర్ ట్యాంకర్‌ల ద్వారా నీటిని సంపులో డంప్ చేసి తద్వారా పైపులైన్‌ల గుండా నీటిని సరఫరా చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మంజీరానీటి కోసం కష్టపడితే చివరకు గోదావరి జలాలు గ్రామాలకు దాహార్తిని తీరుస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామాలలో పైపులైన్‌లను సైతం వేసి ప్రతి ఇంటికి గోదావరి జలాలు సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
బాచుపల్లిలో తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తానని సర్పంచ్ ఆగం పాండు అన్నారు. గ్రామంతో పాటు అమ్లేట్ బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలలో సైతం గోదావరి జలాలను సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో నూతనంగా పైపులైన్‌లను వేయిస్తానని చెప్పారు.
నిజాంపేట్ గ్రామానికి గోదావరి జలాలు రావడం వలన లక్షల రూపాయల ఖర్చు తగ్గుతుందని గ్రామ సర్పంచ్ శెనిగల ప్రమీల అన్నారు. ప్రతి నెల సుమారు రూ.12 లక్షల వరకు నీటి కొనుగోలుకు ఖర్చు అయ్యేదని, గోదావరి జలాలతో ఖర్చు మిగులుతుందని చెప్పారు. రాబోవు కాలంలో గ్రామంలో నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.