రంగారెడ్డి

రసాయనాల డంప్ చెలరేగిన మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 5: జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లి శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిర్విరామంగా తొమ్మిది గంటలపాటు మంటలు చెలరేగి నాలుగు కెమికల్ గోదాములు పూర్తిగా దగ్ధం కాగా ఓ గోదాము పాక్షికంగా దగ్ధమైంది.
ఒక కెమికల్ గోదాము నుండి మరో నాలుగు గోదాములకు మంటలు అంటుకుని ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అక్రమ గోదాములలో తరుచూ అగ్ని ప్రమాదం సంభవించడం జీడిమెట్లలో సర్వసాధారణంగా మారింది. వివరాల్లోకి వెళితే.. దూలపల్లి గ్రామ శివారులో అక్రమంగా నెలకొల్పి గుట్టుచప్పుడు కాకుండా సురేశ్‌బాబు అనే వ్యక్తి పిఎస్‌ఆర్ కెమికల్స్ రసాయన (సాల్వెంట్స్) గోదాములో శనివారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో స్టోలిన్ మిథిలాన్ రసాయనాన్ని మరో డ్రమ్ములోకి డంపింగ్ చేస్తుండగా స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. ఒకే గోదాములో వెయ్యికి పైగా రసాయన కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండడంతో మంటలకు ఆజ్యం పోసినట్లైంది. దీంతో పిఎస్‌ఆర్ కెమికల్స్ నుండి ప్రక్కనే ఉన్న ఆనంద్‌కు చెందిన శ్రీని కెమికల్స్, మనోజ్ త్రిస్టార్ కెమికల్స్, రితీశ్‌కు చెందిన రితేశ్ ట్రేడింగ్ ఎంటర్ ప్రైజెస్ కెమికల్ గోదాములకు మంటలు అంటుకున్నాయి. ఒకదానికొకటి రసాయన గోదాములకు మంటలు అంటుకుని బాంబుల్లా రసాయన డ్రమ్ములు పేలడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ గోదాముల నుండి సైతం రసాయన డ్రమ్ములను ఇతర ప్రాంతానికి డిసిఎంలలో తరలించారు. తొమ్మిది గంటలపాటు చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్‌ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దూలపల్లి గ్రామ శివారులో ఉన్న కెమికల్ రసాయన గోదాములు అక్రమంగా కొనసాగుతున్నా పట్టించుకోని అధికారులు కనీసం ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడైనా స్పందించి అక్రమ గోదాములపై కఠిన చర్యలు తీసుకుని దూర ప్రాంతాలకు గోదాములను తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.