రంగారెడ్డి

హోలీ సంబరాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 20: ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగులిని భూమిపైకి దింపే పండుగ హోలీ.. చిన్నా పెద్దా అంతా కలిసి రంగుల్లో మునిగితేలే సంబురం హోలీ పండుగా. ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగను చిన్నపెద్దా అనే తారతమ్యం లేకుండా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. వివిధ రకాల రంగులను తీసుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వారి ప్రేమానురాగాలను వెలిబుచ్చుకుంటారు. కానీ, ఆ సంతోషం ఎప్పటికీ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే హోలీ సందర్భంగా చల్లుకునే రంగుల్లో అనేక రసాయనాలు ఎక్కువగా కలుస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరమై రంగులతో కళ్లు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. రసాయన రంగుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హోలీ పండుగ వచ్చిందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే రంగుల సందడి మొదలవుతుంది. గతంలో చిన్నా, పెద్దా అంతా కలిసి రకరకాల పూలు, పండ్లతో రంగులు తయారు చేసి పండుగ రోజు చల్లుకునే వాళ్లు. కాలం మారుతున్న పరిస్థితుల్లో రసాయన రంగులు మార్కెట్లోకి వచ్చాయి. దాంతో ఆ రంగులతో ఆరోగ్య సమస్యలు సైతం ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. మార్కెట్‌లో ఎక్కువగా కాపర్ సల్ఫేట్ (ఆకుపచ్చ), మెర్క్యురీ సల్ఫేట్ (ఎరుపు), కాల్షియం క్రోమియం (ఊదా), లెడ్ ఆక్సైడ్ (నలుపు), అల్యూమినియం బ్రోమైడ్ (వెండిరంగు)రంగులు అమ్ముతున్నారు. ఈ రంగులన్నీ దుస్తులు అద్దడానికి ఉపయోగించేవి. వీటిని శరీరంపై పూసుకోవడంతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ప్రమాదం ఉంది. రసాయన రంగులు నీటితో కలిసి భూమిలో ఇంకిపోతే పర్యావరణం కలుషితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే ఈ రంగులు ఎంతో విషతుల్యమైనవి. ఎంత కడిగినా ఇవి శరీరాన్ని వదలవు. అనేక రకాల చర్మవ్యాధులులతో పాటు ఇవి కళ్లలో పడితే కంటి సమస్యలు, నోట్లోకి వెళ్తే శ్వాసకోశ వ్యాధులు, కాలేయం దెబ్బతినడం లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. సహజంగా లభించే కొన్ని పూలు, ఆకులు, పండ్లతో రంగులను తయారు చేసుకొని హోలీ సంబురాలను జరుపుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. సహాజంగా ప్రకృతి పరంగా లభించే రంగులతో ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదని చెప్పవచ్చు.
హోలీ రోజు బలవంతం వద్దు
కొందరు రసాయన రంగుల గురించి తెలిసి వేడుకలకు దూరంగా ఉండటంతోపాటు ఇంకొందరు అలర్జీతో రంగులకు దూరంగా ఉంటారు. అలాంటి వాళ్లను కూడా వదలకుండా స్నేహితులు, బంధువులు రంగులు చల్లుకుంటారు. అలా చేయడంతో కొత్తకొత్త వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిపై, అత్యవసర విధులు నిర్వర్తించే ఉద్యోగులపై రంగునీళ్లు చల్లి ఇబ్బంది పెట్టొద్దు. పిల్లలు ఒంటిపై రంగులు శుభ్రం చేసుకునేందుకు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. పెద్దలు ఓ కంట కనిపెట్టడం మంచిది.
జాగ్రత్తలు పాటించాలి
రంగులు నేరుగా ముఖంపై పడకుండా చల్లాలి. కళ్లకు హాని జరగకుండా అద్దాలు పెట్టుకోవడం మంచిది. హోలీ ఆడిన వెంటనే రంగులను శుభ్రంగా కడుక్కోవడం, అరగంట పాటు తలస్నానం చేయాలి. శరీరానికి మాయిశ్చరరైజర్ ఆయిల్, సన్‌స్క్రీన్ లేపనాలను రాసుకుంటే రంగుల ప్రభావం ఎక్కువ ఉండదు. రంగుల ప్రభావంతో వెంట్రుకలు పొడిబారుతాయి. తలలో దద్దుర్లు, దురద వస్తాయి. దాంతో వెంట్రుకలు తెల్లగా మారుతాయి. అందుకే రంగులు చల్లుకునేటప్పుడు టోపీలు పెట్టుకోవడం మంచిది.
రసాయనాలతో ఆరోగ్య సమస్యలు
రసాయన రంగులతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రంగులలో ఉండే రసాయనాలతో కళ్లకు ఎక్కువగా హాని జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు మార్కెట్‌లో రంగులు చల్లేందుకు ఉపయోగించే పరికరాలు దొరుకుతున్నాయని, వాటితో చల్లితే కళ్లలోకి రంగులు ఫోర్స్‌గా వెళ్తాయని, దీనివల్ల ఒక్కోసారి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొన్నారు. రసాయనాలు కంటిలోని తెల్లని పొరపై పడితే అవి చెడు ప్రభావం చూపుతాయని, తాత్కాలికంగా అంధత్వం కూడా రావొచ్చని అన్నారు.
సహజమైన రంగులను వాడాలి
* సరోజినిదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం
మెహిదీపట్నం: హోలీ పండుగలో సహజమైన రంగులను చల్లుకోవాలని సరోజిని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం తెలిపారు. గురువారం హోలీ పండుగ పురస్కారించుకుని హోలీ పండుగలో చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. గతంలో రసాయన రంగులు చల్లుకోవడంతో కళ్లు పోయి అంధకారం అయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. చిన్నారులే ఎక్కువగా కంటి చూపు పోయినవారిలో ఉన్నారని తెలిపారు. చిన్నారులు రసాయన రంగులు వాడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. హోలీ ఆడేవారు కళ్ల జోడును ఏర్పాటు చేసుకుంటే మరి మంచిదని తెలిపారు. కోడిగుండ్లు కూడా చాలా ప్రమాదం అని తెలిపారు. దీంతో హోలీ పండుగలో కోడిగుండ్లును వాడకపోవడం మంచిదన్నారు. ప్రమాదవశాత్తు కంట్లో రసాయన రంగు పడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు.