రంగారెడ్డి

మేడ్చల్‌లో మహిళామణులకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 25: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్‌ల ప్రకారం మేడ్చల్‌లో నారీమణులే అధికారం చేపట్టనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్‌లతో మేడ్చల్ మండల ఎంపీపీ జనరల్ మహిళగా, జడ్పీటీసీ జనరల్ మహిళగా మారింది. దీంతో మండలంలో తిరిగి మహిళలే మండల అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. 2014 ఎన్నికల్లో రిజర్వేషన్‌ల ఆధారంగా మేడ్చల్ మండల ఎంపీపీ బీసీ మహిళ, జడ్పీటీసీ ఎస్సీ మహిళకు కేటాయించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కూడా మహిళే ఎన్నిక కావడం విశేషం. తిరిగి ఐదేళ్ల తర్వాత కూడా ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్‌లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు మహిళలకే కేటాయించడం గమన్హారం. మహిళమణులే పెత్తనం చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్‌ల ఆధారంగా గతంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కొన్ని గ్రామాలు మున్సిపల్‌గా ఏర్పడటంతో 10 ఎంపీటీసీ స్థానాలకు కుదించారు. ప్రస్తుతం ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు కూడా జనరల్ మహిళలకే కేటాయించడం సర్పంచ్‌లు, ఎంపీటీసీల్లో కూడా 50 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉండటం, ఎంపీడీవో కూడా మహిళ కావడంతో మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయం పూర్తిగా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులతో కళకళలాడనుంది. ప్రభుత్వం మూడు విడతలుగా నిర్వహించనున్న ఎన్నికల్లో మేడ్చల్ మండలంలో మొదటి విడతలో పోలింగ్ జరుగనుంది. అధికార పార్టీలో గ్రామాల వారీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అంటూ గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.