రంగారెడ్డి

ఒంటికి యోగా మంచిదేగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 16: యోగా చేయడంతో శారీరక మానసిక సమస్యలను అధిగమించవచ్చని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని తెలంగాణ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన యోగా రోడ్ షోకి సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమాజంలో అందరూ మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారని చెప్పారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా జీవనం సాగించాలంటే క్రమం తప్పకుండా యోగా సాధన తప్పనిసరిగా చేయాలని సూచించారు. యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో సిబ్బందికి యోగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ వీఎస్ అలుగు వర్షిని మాట్లాడుతూ 21న ప్రపంచ యోగా డే పురష్కరించుకుని కర్టెన్ రైసర్‌గా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
డిపార్టమెంట్ ఆఫ్ ఆయుష్ సెంటర్లను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. 20న బల్కంపేట్ నేచురోపతి కాలేజీ, బేగంపేట నేచర్‌క్యూర్ హాస్పిటల్‌లో సహజ సిద్ధ ప్రకృతి ఆహార ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 25న గచ్చిబౌలి స్టేడియంలో యోగా అవగాహన కార్యక్రమం ఉంటుందని అన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళల్లో మెనోపాజ్ సమస్యలపై ప్రొటోకాల్ డిజైన్ చేశామని తెలిపారు. డిసెంబర్‌లోగా మూడున్నర లక్షల మందికి మెనోపాజ్ ఉచిత చికిత్స అందించనున్నామని పేర్కొన్నారు. యోగా రోడ్‌షోతో పాటు యోగా వాక్‌ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యోగా డే నోడల్ ఆఫీసర్ బాలకృష్ణతో పాటు డాక్టర్లు ఉమా శ్రీనివాస రావు, పార్ధసారధి, లింగరాజు, తెలంగాణ ఆయుష్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, శ్రీలత, రాణి, బీఆర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రవీందర్ పాల్గొన్నారు.