రంగారెడ్డి

అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జూన్ 19: అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ డిమాండ్ చేశారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల దీక్షను ప్రారంభించారు. జయలక్ష్మీ మాట్లాడుతూ అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని, ఇతర పౌష్టిక ఆహారం, గుడ్లు వంటి వాటిని సరఫరా చేయడంతో పాటు రవాణా చార్జీలను ప్రభుత్వమే భరించాలని సూచించారు. ఇవేమి పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా అంగన్‌వాడీలపై పెట్టిందని అన్నారు. చాలీచాలని వేతనాతో అంగన్‌వాడీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రికార్డులకు సంబంధించిన మెటీరియల్‌ను ప్రభుత్వం సరఫరా చేయడమే కాకుండా టీఏ, డీఏ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయు నాయకులు శ్రీనునాయక్, సాయిబాబా, ఈశ్వర్‌నాయక్, రాజశేఖర్, జయమ్మ, శ్రీదేవీ, నిర్మల, గిరిజా, ఇందిర పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ
షాద్‌నగర్ రూరల్, జూన్ 19: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించేందుకు వీలుంటుందని దేవునిపల్లి సర్పంచ్ చేగూరి రాఘవేందర్ గౌడ్ అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సర్పంచ్ చేగూరి రాఘవేందర్ గౌడ్ రూ.25వేల చెక్కును షాద్‌నగర్ పోలీసులకు అందజేశారు. రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో గ్రామంలో నేరాలు, దొంగతనాలు నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.