రంగారెడ్డి

వాహనాలకు వేగ నియంత్రణ బిగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 19: రోడ్ల పై తిరిగే ప్రతి వాహనానికి వేగ నియంత్రణ పరికరం తప్పనిసరిగా బగించుకోవాలని లేని పక్షంలో అట్టి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా రవాణాశాఖ అధికారి వాణి బుధవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించారు. ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగస్టు మాసం నుంచి తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. స్కూల్ బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థుల నుంచి ఎక్కించరాదని, అలా చేస్తే స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు.

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి
షాబాద్, జూన్ 19: గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కుమ్మరిగూడ సర్పంచ్ పొన్నమోని కేతన రమేష్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో వార్డు సభ్యులతో కలిసి గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ట్యాక్స్‌లు చెల్లించాలని వివరించారు. గ్రామంలో మురికి కాలువలు, వీధి దీపాలు, సీసీ రోడ్లు మంచి నీటి సమస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ నరసింహా రెడ్డి, ఎంపీటీసీ పోచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, వార్డు సభ్యులు యాదగిరి, అనిత, అమృత, యాదమ్మ, శోభ కారోబార్ నర్సింలు పాల్గొన్నారు.