రంగారెడ్డి

హరితహారాన్ని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల స్ధాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో మొక్కలు నాటితే ప్రతి మొక్క బ్రతికే అవకాశముందని అన్నారు. ఇంటింటికీ అవసరమయ్యే పండ్లు, పూల మొక్కలు అందించాలని తెలిపారు. వర్షాకాలం మొదలై నెల రోజులు కావస్తున్నా గ్రామ పంచాయతీలకు మొక్కలు అందజేయక పోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు మొక్కలు నాటడం మొదలుపెట్టని శాఖలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ రాకముందే ప్రజాప్రతినిధును భాగస్వాములను చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు. ఈనెల 18 వతేదీన పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి, పోలింగ్ కేంద్రాలపై వచ్చే అభ్యంతరాలను సరిచేసి 21న పోలింగ్ కేంద్రాల ఫైనల్ పబ్లికేషన్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. వార్డులవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను తయారు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయరాదని, కమిషనర్లు ఇంక్‌పెన్‌తో సంతకం చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు గ్రామ పంచాయతీ నిధుల నుండి కల్పించాలని తెలిపారు. అనంతరం నర్సరీ డైరెక్టరీ బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో మధుకర్ రెడ్డి, డీపీఓ రవి కుమార్, డీఆర్‌డీఓ కౌటిల్య, డీఏస్‌ఓ సుధాకర్ రెడ్డి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి పాల్గొన్నారు.

కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి
మహేశ్వరం, జూలై 16: కాంగ్రెస్ వీడి నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు మల్లు రవి ఆన్నారు. మంగళవారం రాత్రి తుక్కుగూడ మున్సిపాలిటి కేంద్రంలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సబితా రెడ్డి స్వార్ధం కోసం, ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మరారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి నాయకులు జానకీరామ్, ఎం.రాజు పాల్గొన్నారు.