రంగారెడ్డి

ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 27: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని హఫీజ్‌పేట్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం హఫీజ్‌పేట్‌లో స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్పొరేటర్ పూజిత మాట్లాడుతూ నాటిన మొక్కలను పిల్లల్లా చూసుకుని పెంచి పెద్ద చేయాలన్నారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఆనంద్ గౌడ్, బాబూగౌడ్, గౌస్, సత్తార్‌లతో పాటు బస్తీవాసులు పాల్గొన్నారు.
చందానగర్‌లో..
హరితహారం కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి మొక్కలను అందజేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే మొక్కల పెంపకాన్ని ఒక అభిరుచిగా మలచాలని సూచించారు. ప్రతి మనిషికి ఒకటి చొప్పునైనా మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. ఎన్ని మొక్కలైనా ఉచితంగా అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆశారెడ్డి, పోచయ్య, మధుసూదన్ రెడ్డి, గోపాల్, సంక్షేమ సంఘం నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మియాపూర్‌లో..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ కోరారు. బుధవారం మియాపూర్ డివిజన్ పరిధి మయూరినగర్‌లోని కేంద్రీయ విహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. కార్పొరేటర్ మేక రమేష్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడానికి మొక్కలు పెంచడం మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఇంటిలో మనిషికి ఒకటి చొప్పున మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం కేంద్రీయ విహార్ అసోసియేషన్ సభ్యులు, జిహెచ్‌ఎంసి సిబ్బందితో కలిసి కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు.
శ్రీ చైతన్య విద్యార్థుల ర్యాలీ
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకంపై శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్ధులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం హుడా ట్రేడ్ సెంటర్‌లోని టెక్నో స్కూల్ నుంచి కాలనీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ర్యాలీలో శ్రీ చైతన్య డీమ్ గోవింద్, ప్రిన్సిపాల్ నరేష్ యల్లంకి, పిఇటి వేణుగోపాల్ పాల్గొన్నారు.
మొక్కల అందజేత
బాలానగర్: పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలొని జింకల వాడలో మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కలు నాటాలన్నారు. భావితరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించేందుకు విధిగా మొక్కలు నాటాలని చెప్పారు. కార్యక్రమంలో సిఓ కిషోర్, నాయకులు సాగర్‌రావు, బస్వరాజ్, రాజ్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, బాకి, కన్నయ్య, సాయికిరణ్, రత్నమాల, మీనా, మంజుల, లక్ష్మీ, కృష్ణకుమారి, శిల్ప పాల్గొన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్ల: ప్రతి ఇంటికి ఐదు మొక్కలు నాటి పర్యవరణ పరిక్షణకు కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. చెట్లు ప్రగతికి మెట్టని తెలిపారు. తెలంగాణలో 35 శాతం అడవుల పెంపకమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు. మొక్కలు నాటి వాటిని వదిలేయకుండా వాటిని సంరక్షించి బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపిపి బాల్‌రాజ్, వైస్ ఎంపిపి పోలీసు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవని విజయలక్ష్మి శర్వలింగం, వైస్ చైర్మన్ సామా మణిక్యరెడ్డి, చేవెళ్ల ఆర్డీవో చంద్రమోహన్, ఎంపిడివో రత్నమ్మ, నాయకులు రాంరెడ్డి, శ్రీను, పాపిరెడ్డి ఉన్నారు.
జెఇటిఎల్‌లో
జీడిమెట్ల: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు.
బుధవారం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జెఇటిఎల్‌లో హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు.
ప్రతిఒక్కరూ విధిగా ఒక్కో మొక్కను నాటి స్వచ్ఛమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు పాటుపడాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం హరితహారం కార్యక్రమంలో ముందుందని చెప్పారు. ప్రతిఒక్కరు మొక్కలను నాటి బాధ్యతతో వాటిని సంరక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెఇటిఎల్ ఫైనాన్షియల్ డైరెక్టర్ ఆర్‌కె అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బక్కరెడ్డి, జిఎండిఐసి ప్రశాంత్‌కుమార్, నాయకులు మనె్నరాజు, రంగారావు, నాగరాజు యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘హరితహారం’లో
భాగస్వాములు కావాలి
మోమిన్‌పేట: హరితహారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఐసిడిఎస్, సిడిపిఓ కాంతారావు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో అంగన్‌వాడి కార్యకర్తలతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడి కార్యకర్త తమ సెంటర్లలో మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు జగమ్మ, జగదాంబ, సునీల్, సిబ్బంది, మండల పరిధిలోని ఆయా గ్రామాల అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వనస్థలిపురంలో..
వనస్థలిపురం: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగోలు కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని బండ్లగూడ కృషినగర్‌లోగల అక్షర టెక్నోస్కూల్‌లో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మొక్కలను అందచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాటిన మొక్కలను పెంచేలా కృషి చేయాలని కోరారు.
మొక్కలునాటే కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమని చెప్పారు. పాఠశాల చైర్మన్ జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులకు చెట్ల పెంపకం పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్గిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బెల్లంకొండ కళావతి, ప్రవీణ్, కవిత, ఏఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేసిఆర్, కెటిఆర్, టిహెచ్‌ఆర్‌లు అబద్దాలకోర్లు
వికారాబాద్, జూలై 27: రాష్ట్రాన్ని పాలిస్తున్న సిఎం కేసిఆర్, తనయుడు కెటిఆర్, అల్లుడు హరీష్‌రావులు ఉదయం లేచింది మొదలు అబద్దాలే మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్ విమర్శించారు. బుధవారం స్థానిక తెలంగాణ కూడలిలో సిఎం కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా మాట్లాడుతూ మల్లన్నసాగర్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్య యుతంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు పూనుకుంటే నిరంకుశంగా, నియంతృత్వంగా అరెస్ట్ చేసినందుకు నిరసన తెలుపుతున్నామని చెప్పారు. 2013 జివో ప్రకారమే భూసేకరణ చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసే విధంగా 123 జివోను సృష్టించి ఎకరాకు కేవలం ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసిఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణ అవుతోందని పేర్కొన్నారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. మల్లన్నసాగర్ రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తున్న భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధులు జె.రత్నారెడ్డి, ఎ.రాజశేఖర్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఎల్.శశాంక్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.అనంత్‌రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌లు డి.లక్ష్మణ్, సి.రామస్వామి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, యువజన కాంగ్రెస్ నాయకులు వెంకట్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, కౌన్సిలర్ మధుకర్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మతిన్, రెడ్యానాయక్, జి.రమేష్‌గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, జనార్దన్, రఘుపతిరెడ్డి, బాలయ్య, నర్సింలు, రహీం, వెంకటయ్యగౌడ్, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు జాఫర్, గురువారెడ్డి పాల్గొన్నారు.

నిజాంపేట్ గ్రామ సర్పంచ్.. తల్లా? తనయుడా?
జీడిమెట్ల, జూలై 27: నిజాంపేట్ గ్రామ సర్పంచ్.. తల్లి ప్రమీలనా..? లేదంటే తనయుడు ధన్‌రాజా? తెలియడం లేదని ఎంపిటిసి చందు ముదిరాజ్ ప్రశ్నించారు. బుధవారం నిజాంపేట్ గ్రామ పాలకవర్గం సమావేశం సర్పంచ్ శెనిగల ప్రమీల అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గ్రామంలోని సర్వే 334కు ఆనుకుని మూడెకరాల ప్రైవేటు వెంచర్‌కు ప్రభుత్వ రోడ్డును వాడుకుంటున్నారని, దీనిపై తాము సదరు బిల్డర్‌ను ప్రశ్నిస్తే సర్పంచ్ తనయుడు ధన్‌రాజ్‌తో మాట్లాడామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎంపిటిసి చందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు బిల్డర్ అనుమతి కొరకు గ్రామ పంచాయతీ రావాలే తప్ప సర్పంచ్ తనయుడి వద్దకు వెళ్లడమేమిటని ప్రశ్నించాడు. వెంటనే వెంచర్‌కు వెళ్లే ప్రభుత్వ స్థలంలోని దారిని మూసి వేయించి పనులను నిలిపివేయాలని ఇవో దుర్గాప్రసాద్‌ను ఆదేశించారు. గ్రామంలోని శ్మశాన వాటికలో వర్షపు నీరు నిండిందని, వాటిని వెంటనే తొలగించాలని సభ్యులు లత, మంగమ్మ కోరారు. స్మశానవాటికలోనే పైపులైన్‌లను వేశారని, ప్రస్తుతం గ్రామంలో కొనసాగుతున్న పైపులైన్‌ల పనులను సదరు కాంట్రాక్టర్ మోహన్‌రెడ్డి ఎగుడుదిగుడుగా ఇష్టానుసారంగా వేస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పిన కాంట్రాక్టర్ వినడం లేడని ద్వజమెత్తారు. భవిష్యత్తులో ఖననానికి వచ్చే ప్రజలు త్రవ్వకాలు చేస్తే పైపులు పగిలిపోవా అని సభ్యులు ప్రశ్నించారు. సత్వరమే పనులను నిలిపివేసి మరొకచోట నుండి వేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్థంభాలు నిర్మాణం వంటి పనులను సదరు కాంట్రాక్టర్‌లు ఇష్టానుసారంగా వేసి చేతులు దులుపుకుంటున్నారని, కాంట్రాక్టర్‌లు నాణ్యతతో పనులను చేపడితేనే బిల్లులను చెల్లించాలని లేని పక్షంలో కాంట్రాక్టర్‌లను బ్లాక్ లీస్ట్‌లో పెట్టాలని సభ్యులు పట్టుబట్టారు. గ్రామంలో బండరాయి వచ్చిన వీధులలో రోడ్లు, డ్రైనేజీ పనులను చేయకుండా చదునుగా ఉన్న వీధులలోనే ప్రస్తుత కాంట్రాక్టర్‌లు చేయడంపై సభ్యులు మండిపడ్డారు. ఈ విషయంపై ఇవో దుర్గాప్రసాద్.. కాంట్రాక్టర్‌లను వెంటనే పిలిపించి మందలించారు. నాణ్యతతో అభివృద్ధి పనులను చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో సహించేది లేదని హెచ్చరించారు. సభ్యులను గౌరవించే గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటానని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపిటిసిలు సురేశ్ యాదవ్, రాధిక, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

అద్దెకు ఉండి.. చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు
మేడ్చల్, జూలై 27: ఇళ్లలో అద్దెకు ఉంటున్నట్లు నటించి ఇంటి యాజమానులపై మత్తుమందు ప్రయోగించి చోరీకి పాల్పడుతున్న దొంగలను మేడ్చల్ పొలీసులు అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్ డివిజన్ ఏసిపి అశోక్‌కుమార్ బుధవారం పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 28న మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని ఓ ఇంటిలో అద్దెకు దిగిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి యాజమానురాలైన అత్త కోడళ్లపై మత్తుమందు ప్రయోగించి వారి మెడలో ఉన్న సుమారు తొమ్మిది తులాల రెండు బంగారు పుస్తెలతాడులను అపహరించుకుని ఉడాయించిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వడ్డెపల్లికి చెందిన గుండి వెంకటేశ్ అలియాస్ గణేశ్(25), అక్క వలిగమ్మ వివిధ జిల్లాలలో దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లింది. వలిగమ్మను బెయిల్‌పై విడిపించడానికి తమ్ముడు వెంకటేశ్ అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి దొంగతనం చేయాలని భార్య పద్మ తల్లి లక్ష్మీ అలియాస్ తిరుపతమ్మకు వివరించాడు. వెంకటేశ్‌కు సహకరించేందుకు అంగీకరించారు. వీరంతా ఇళ్లల్లో అద్దెకు ఉంటూ ఇంటి యాజమానులతో స్నేహంగా ఉండి వీలు చిక్చినప్పుడల్లా వాళ్లు తినే పదార్థాలలో నిద్ర మాత్రలు కలిపి వాళ్లు మత్తులోకి జారుకోగానే మెడలోని బంగారు పుస్తెల తాడులను దొంగలించుకోపోవాలని పథకం రచించారు. ఈ నేమథ్యంలో వీరంతా మే నెలలో నగరంలోని నాచారం మల్లాపూర్ ప్రాంతంలో ఒక గది అద్దెకు తీసుకుని ఉన్నారు. అక్కడ వెంకటేశ్‌కు నల్గొండ జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్‌కు గ్రామానికి చెందిన దేవునురి బాలయ్యతో పరిచయం ఏర్పడింది. బాలయ్య కూడా వీరితో చేతులు కలిపాడు. వారనుకున్న విధంగా మెదక్ జిల్లా గుమ్మడిదల గ్రామం జిన్నారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంటి యాజమానికి కల్లులో నిద్ర మాత్రలు కలిపి మత్తులోకి జారుకోగానే మెడలో నుండి బంగారు పుస్తెల తాడుతో పాటు ఓ బైక్‌ను అపహరించుకుని పారిపోయారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో ఓ ఇళ్లును అద్దెకు తీసుకుని ఇంటి యాజమానురాలైన రాములమ్మ, కోడలు నీరజకు నిద్రమాత్రల పోడిని కాకరకాయ కూరలో కలిపి ఇవ్వగా అది తిన్న వారు మత్తుగా నిద్రపోయిన తర్వాత వారి మెడలోని తొమ్మిది తులాల బంగారు పుస్తెల తాళ్లు తెంపుకుని ఉడాయించారు. బుధవారం వెంకటేశ్, బాలయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి తొమ్మిది తులాల రెండు బంగారు పుస్తెల తాళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న లక్ష్మీ అలియాస్ తిరుపతమ్మ, దివ్య కోసం గాలిస్తున్నామని త్వరలో వారికి కూడా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో సిఐ రాజశేఖర్‌రెడ్డి, క్రెం ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. కేసు అనతికాలంలో చేధించిన ఎస్‌ఐను సిబ్బంది ఎసిపి అభినందించారు.

ప్రజాప్రతినిధులను ప్రతి నెలా కలుస్తాం

వికారాబాద్, జూలై 27: ప్రజాప్రతినిధులను ప్రతినెల వచ్చి కలిసి ఆసుపత్రికి సంబంధించిన వివరాలు అందిస్తామని వికారాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదగిరి అన్నారు. బుధవారం ఆసుపత్రి సలహా సంఘం చైర్మన్, వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విచిత్రంగా స్పందించారు. ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో తప్పులు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని, ప్రజల వెంట తాము ఉంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో భోజనం ఎంతమందికి పెడుతున్నారని ప్రశ్నించగా సిబ్బంది లెక్కలు చెప్పడంలో నీళ్లు నమిలారు. ఎమ్మెల్యే చేతికి ఇచ్చిన రిజిస్టర్‌లో సమావేశం రోజున తేదీకి సంబంధించిన వివరాలు కాకుండా ఒక రోజు వివరాలను చూపడంతో ననే్న తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ డిసిహెచ్‌ఎస్ వచ్చి చెప్పేంత వరకు సూపరింటెండెంట్ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు భోజనం ఖర్చుల వివరాలు ఎందుకు తెలియపర్చలేదని నిలదీశారు. ఆసుపత్రిని ఇష్టం వచ్చినట్టు నడుపుకోండంటూ అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ముగింపు సమయంలో డిసిహెచ్‌ఎస్ హన్మంతరావు వచ్చారు. వికారాబాద్ ఎంపిపి, జడ్పిటిసిలు ఎస్.్భగ్యలక్ష్మి, ముత్తహర్‌షరీఫ్, కౌన్సిలర్‌లు విజయేందగర్‌గౌడ్, సత్యమ్మ, శేషగిరి, మున్సిపల్ కమిషనర్ ఎంకెఐ అలి పాల్గొన్నారు.
మీడియాకు సమాచారం లేదు
పేద ప్రజలకు వైద్య సేవలందించే ఏరియా ఆసుపత్రి సలహా సంఘం సమావేశం సమాచారం మీడియాకు రాలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసిన సమావేశం సమాచారం మీడియాకు రాకపోవడం విచిత్రం. గత ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినపుడు మీడియాకు సమాచారం ఇచ్చేవారు.
ఆసుపత్రిలో ఏయే సేవలున్నాయి, ఎలా అందుతున్నాయో సులభంగా ప్రజల్లోకి వెళ్లేది. ఇపుడు అలా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా సమావేశం ముగించాలనుకున్నారో ఏమోగాని సమాచారం ఇవ్వలేదు. కనీసం సమావేశం ముగిసిన తర్వాతైనా సమావేశంలో ఏయే నిర్ణయాలు తీసుకున్నారు, అభివృద్ది, పురోగతిపై వివరాలు వెల్లడిస్తారేమో అనుకుంటే అదీ లేదు. అసలు అది ప్రభుత్వాసుపత్రా, ప్రైవేటాసుపత్రా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

భారీ వర్షంతో జలమయమైన ప్రధాన రహదార్లు
ఉప్పల్, జూలై 27: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పల్ పట్టణ ప్రధాన రహదార్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షంనీరు చేసి జన జీవనం స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మురికి కాలువలు నిండి పొంగిపొర్లాయి. పెద్ద, నల్ల చెరువు నిండుకుండలా దర్శనిమిస్తున్నాయి. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలోని ప్రధాన రహదార్లలో మోకాళ్లవరకు వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. గల్లీలోని మ్యాన్‌హోల్స్ తెరుచుకుని డ్రైనేజీ నీరంతా పొంగి పొర్లాయి. హబ్సిగూడ-ఉప్పల్ మధ్యలోని మెట్రోరైలు స్టేషన్ వద్ద నిలిచిన వర్షం నీటిలో పలువురు వాహనాదారులు జారి పడ్డారు. కొద్దిసేపు వాహనాలు అక్కడిక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. వర్షం నీటిలో నుంచి బయటకు వెళ్లేందుకు వాహనాదారులు అవస్థలు పడ్డారు.

నాచారంలో క్లోరిన్ గ్యాస్ లీక్
* పలువురికి అస్వస్థత
* భయంతో పరుగులు తీసిన స్థానికులు
నాచారం, జూలై 27: నాచారంలో క్లోరిన్ గ్యాస్ లీక్‌తో తీవ్ర కలకలం రేగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాచారం స్నేహపురి కాలనీ జలమండలి ట్యాంక్ వద్ద నీటిని శుద్ధి చేయడానికి నిల్వ ఉంచిన లిక్విడ్ క్లోరిన్ గ్యాస్‌ను తనిఖీ చేయడానికి క్యాలిటీ సెల్‌కు సంబంధించి సిబ్బంది వచ్చి తనిఖీలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా లిక్విడ్‌గ్యాస్ లీకైంది. దీంతో పక్కనే ఉన్న మీ సేవ సిబ్బందిలో ఇద్దరు అపస్మారక స్థితికి జారుకున్నారు. నాచారం పోలీస్ కానిస్టేబుల్ అక్కడే ఉండటంతో వారు సైతం సృహకోల్పోయారు. ఈ ట్యాంక్ ఇళ్ల మధ్యనే ఉండటంతో చుట్టుపక్కల ఇళ్లలోని వారు బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా సృహకోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం లేకనప్పటికీ ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు భీతిల్లిపోయారు. సంఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

భారతావని ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం
మేడ్చల్, జూలై 27: దివంగత మాజీ రాష్టప్రతి భారతావని ముద్దుబిడ అని ఆయన దేశానికి చేసిన సేవలు చీరస్మణీయమని పలువురు నాయకులు కొనియడారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం బిజెపి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలాం ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ కలాం భారతవని ముద్దుబిడ్డ ఆయన జీవితం అందరీకి ఆదర్శప్రాయమని కొనియడారు. కలాం సేవలను వివరిస్తూ ఆయన ఆశయాలు ఆయన నిరాడంబర జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎంపిపి విజయలక్ష్మీ, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు అమరం మోహన్‌రెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు జగన్‌గౌడ్, ఎంపిటిసి రేణుక, గిర్మాపూర్ ఉపసర్పంచ్ రవీందర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, కిషన్‌రావు, లక్ష్మన్, రాఘవరెడ్డి, రాజేశ్‌గౌడ్, అవినాశ్, సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా కాంగ్రెస్ నగర పంచాయతీ అధ్యక్షుడు బాలమల్లేశ్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాగజ్యోతి, నాయకులు సంజీవరెడ్డి, పోచయ్య, వేముల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్: మాజీ రాష్టప్రతి ఎపిజే అబ్దూల్ కలాం చేసిన సేవలు చీరస్మరణీయమని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య అన్నారు. బుధవారం ఎపిజే అబ్దూల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఫీరోజ్‌గూడలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పాల్గొని పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని గోప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మందాడి సుధాకర్‌రెడ్డి, ఎడ్ల మోహన్‌రెడ్డి, నర్రా దేవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, లక్ష్మణ్, జనార్ధన్, యాదయ్య, నాగరాజు, సదాశావ స్కూల్ ప్రిన్సిపాల్ సదాశివరావు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్: మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని ఏబివిపి నగర సంఘటన మంత్రి స్వామి అన్నారు. బుధవారం స్థానిక సరస్వతి జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం వర్ధంతి సభ నిర్వహించారు. జాతీయ నాయకులను ఆరాధించడంలో ఏబివిపి ముందుందని చెప్పారు. 2020 కల్లా ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధి దేశంగా ఉంటుందని కలాం కలలుగన్నారని, ఆ కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి అబ్దుల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ బస్వరాజ్, ఏబివిపి నాయకులు బాగ్ కో కన్వినర్ నాగేశ్, జిల్లా హాస్టల్ ఇంచార్జి ప్రవీణ్, నగర సంయుక్త కార్యదర్శి మహేష్, మనోజ్ పాల్గొన్నారు.