రంగారెడ్డి

‘అమ్మనాన్నలు’ దేవతలతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, ఆగస్టు 20: ఈ ప్రపంచంలో భారతదేశ సంప్రదాయం విలువలు ఇతర దేశాలకు దిక్సుచిగా నిలుస్తున్నాయని, మానవజాతీ సృష్టికర్త ఒక అమ్మ, అమ్మ విలువలను కనుమరుగవుతున్న కాలంలో గ్రామాల్లోని సంప్రదాయాలు విలువలను కాపాడడానికి ఉప్పల వెంకటేష్ రూపంలో భగవంతుడు మీముందుకు పంపించాడని త్రిదండి ఆహోబిల రామాన్యుజ జీయర్ స్వామిజీ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల పరిధిలోని చుక్కాపూర్ గ్రామ పంచాయితీలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం స్థానిక జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన అమ్మపాదపూజ, ఆశీర్వచనంతోపాటు మహిళలకు ఆరోగ్య వికాస్ తరంగిణి వారి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. పాదపూజకు ముఖ్యఅతిథులుగా త్రిదండి ఆహోబిలం రామన్యుజన జీయర్‌స్వామిజీ, వికాస్ తరంగిణి జాతీయ అధ్యక్షుడు రమేష్ గుప్త, ప్రెసిడెంట్ పాండు రంగారావు, పద్మనాభం, పురుషోత్తం హాజరైయ్యారు. అమ్మ పాద పూజకు భారతమాత చిత్ర పటానికి, హెల్త్‌క్యాంపునకు స్వామిజీచే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమ్మ పాద పూజ - ఆశీర్వచనం సందర్భంగా సుమారు 1500 మంది మహిళలకు ఒక చీర, పూలదండతోపాటు కుంకుమ, పసుపు, అగర్‌బత్తిలను బహుకరించి పిల్లలచే తల్లికి తాంబాలంలో తల్లి రెండు కాళ్లు కడిగి బోట్టుపెట్టి, కాళ్లకు పసుపురాసి, మెడలో పూలమాల వేసి, చీర పెట్టడం, హారతి ఇవ్వడం తల్లులచే పిల్లలకు ఆశీర్వచనం చేయించారు. చుక్కాపూర్, చెన్నారం, ఏడవెల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 400 మంది విద్యార్థిని విద్యార్థులకు కన్నతల్లిదండ్రులచే స్కూల్ యూనిఫామ్‌ను అందించారు. పేద వారి కోసం ఆరోగ్యపరంగా సేవలందించడానికి కోరిన వెంటనే వెంకటేష్ ఒక అంబులెన్స్‌ను విరాళంగా ఇస్తానని తెల్పడంతో స్వామీజీ సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్టు, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు కానీ నన్ను కన్న ఈ ప్రాంతానికి జన్మనిచ్చిన ఈ భూమికి ఏమీ ఇచ్చి రుణం తీర్చుకున్న తక్కువేనని ఉద్వేగంతో ప్రసంగించారు. పేదవారిని ఆదుకోవడానికి స్వచ్ఛందంగా గత పది సంత్సరాల నుంచి విద్యార్థుల చదువులు, దేవాలయాల నిర్మాణాలు, మరణించిన వారి కుటుంబాలను, ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణలు చేసుకోవడానికి కోట్లాది రూపాయాలు విరాళంగా ఇచ్చానని వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, వందేమాతరం పౌండేషన్ రాము, స్థానిక సర్పంచ్ కిష్టమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ కేశవ రెడ్డి, సీడీపీ సక్కుబాయి, పీహెచ్‌సీ డాక్టర్ శారదా, ఎంఈవో సర్ధార్ నాయక్, శంకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రామనాధం, రంగారెడ్డి, చుక్కాపూర్ మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఆయాగ్రామాల సర్పంచ్‌లు వెంకట్రామ్‌రెడ్డి, కుమార్, రఘుపతి, లలిత జ్యోతయ్య పాల్గొన్నారు.