రంగారెడ్డి

జోరుగా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా మేడ్చల్ మునిసిపల్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మునిసిపల్ సిబ్బంది స్థానిక నాయకులు ప్రజలతో కలిసి విరివిగా మొక్కలు నాటుతున్నారు. మంగళవారం పలు కాలనీల్లో మొక్కలు నాటి వాటికి రక్షణగా ట్రీ గార్డులను అమర్చారు. నాయకులు శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, యాదవ్, ఆంజనేయులు, మునిసిపల్ సిబ్బంది సుధాకర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
కులకచర్ల: కులకచర్ల విపణి ఆవరణలో స్థలం చాలా ఉన్నందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని పరిగి శాసనసభ్యుడు కొప్పుల మహేశ రెడ్డి సూచించారు. మంగళవారం కులకచర్లలోని విపణి ఆవరణలో కమిటీ చైర్మన్ తుప్పలి వెంకటేశం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. కమిటీలోని చైర్మన్‌తో సహా డైరెక్టర్లు ఒక్కొ వ్యక్తి ఆరు మొక్కలు చొప్పున సంరక్షించాలని సూచించారు. దీనిపై పోటీపడి మొక్కలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. విపణి చైర్మన్ వెంకటేశం మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు.
రహదారి పనులు ప్రారంభం
కులకచర్ల మండలం చెల్లాపురం పంచాయతీ పరిధిలోని హన్మానాయక్ తండాకు రూ.2 లక్షలతో నిర్మించనున్న రహదారి పనులకు మంగళవారం ఎమ్మెల్యే మహేశ రెడ్డి ప్రారంభించారు. తండాకు ఈ రహదారి నిర్మించడంతో రాకపోకలు సులభతరం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ ముడావత్ సత్తమ్మ, జడ్పీటీసీ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి చేయూత
కులకచర్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. టీడీపీ నుంచి కూడా కొప్పుల కుటుంబీకులు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి వెళ్లి పార్టీకోసం పనిచేసేవారు. విషయాన్ని ఎమ్మెల్యే తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి ‚10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.