రంగారెడ్డి

కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 21: కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కార్తికేయ కామాక్షి కెమికల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుఝామున కార్మికులు కెమికల్ రసాయనాలను కలుపుతుండగా రియాక్షన్ అయి మిస్ ఫైర్ కావడంతో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో భారీ శబ్దం రావడంతో కార్మికులు పరిశ్రమ నుంచి బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్‌లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ్ధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో భారీ మొత్తంలో ఆస్థి నష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు, అధికారులు తెలిపారు. శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో మంటలు తీవ్ర రూపం దాల్చాయని, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుంటామని అన్నారు. ఇదే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించడం రెండోసారని, పరిశ్రమ నుండి ప్రమాదకర రసాయనాల వాసనలు వెలువడుతాయని స్థానికులు చెబుతున్నారు. రసాయనాల దుర్వాసనతో శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చిన పెడ చెవిన పెట్టేవారని, అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడి కెమికల్ పరిశ్రమల పై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి కెమికల్ పరిశ్రమలను తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
జీడిమెట్ల, సెప్టెంబర్ 21: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కొంపల్లి సెంట్రల్ పార్కులో కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కొంపల్లి మున్సిపల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఉండాలని, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్ రెడ్డి, శివారెడ్డి, ప్రశాంత్, సుదర్శన్ రెడ్డి, శివకుమార్, బాస్కర్, అశోక్, సురెందర్ రెడ్డి, నిషాంత్, ఇబ్రహీమ్, కావలి గోపాల్ పాల్గొన్నారు.