రంగారెడ్డి

పోలీసు అమరవీరుల సేవలు మరవలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 20: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి దుర్గా కనె్వన్షన్‌లో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏసీపీ అశోక చక్రవర్తి ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు యువకులు, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. రక్త్ధాతలను ఏసీపీ అశోక చక్రవర్తి అభినందించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో రాజేంద్రనగర్ పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహించామని మొత్తం భారీ ఎత్తున యువకులు తరలివచ్చి రక్తదానం చేశారని ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్లు జీ.సురేష్, సత్తయ్య గౌడ్, డీఎస్సై సునీల్ కుమార్, ఎస్సైలు రవీంద్ర నాయక్, గోపరాజు, నాది హుస్సేన్, కే.రవి పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వారోత్సవాలలో బండ్లగూడ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు పోలీసులు వాడే ఆయుధాలను చూపించారు.
కేశంపేట: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కేశంపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని బైర్‌ఖాన్‌పల్లి గ్రామంలో ఎస్‌డీఎఫ్ నిధులు రూ.9లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేట గ్రామంలో రూ.11.23లక్షలతో నిర్మించనున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి, రూ.2.5లక్షలతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన అంతర్గత మురుగుకాలువలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కును మండల పరిధిలోని కాకునూరు గ్రామానికి చెందిన టీ.కృష్ణయ్యకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
కార్యక్రమంలో రూరల్ సీఐ రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్, పల్లె నర్సింగ్ రావు, నక్కల గోపాల్, మఠం శేఖర్, ఎంపీటీసీలు రమేష్, రమాదేవి, యాదయ్యచారి, జమాల్ ఖాన్, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.