రంగారెడ్డి

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 21: పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బిల్‌కలెక్టర్ శ్రీ్ధర్‌ను విధుల నుంచి తొలగించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. గురువారం మన నగరంలో భాగంగా దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల్లో కలెక్టర్ పర్యటించారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో పెంట కుప్పలు ఎక్కడి చెత్త అక్కడే పడి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి, స్వయంగా చెత్తను తొలగించారు. కాలనీల్లో వీధి లైట్లు లేకపోవడం, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ కంచె లేకపోవడం చూసి కంచె ఏర్పాటు చేసి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షించి, చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డెంగ్యూ జ్వరాలు తగ్గనందున పారిశుద్ధ్యంపై నిరంతం దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు రామలింగం, వాణి, తహశీల్ధార్ నాగరాజు, ప్రత్యేక అధికారి సత్తార్, మేనేజర్ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.