రంగారెడ్డి

పట్టణ ప్రగతితో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, ఫిబ్రవరి 26: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆమనగల్లు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసినపుడే పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధిలో ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చైర్మెన్ రాంపాల్‌లు హాజరై పలు వార్డులను పరిశీలించారు. విద్యనగర్ కాలనీలోని నూతన విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ట్రాన్స్‌కో కార్యాలయం, బీసీ కాలనీలోని హారిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖి చేసి రోగులతో మంత్రి స్వయంగా మాట్లాడి వైద్యం ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాదగిరిని మంత్రి పరామర్శించారు. ఎస్సీ, బీసీ కాలనీలలోని మంత్రి పర్యటిస్తుండగా స్థానిక మహిళలు మురికి కాలువలలో పేరుకపోయిన చెత్త చెదారంతో దుర్వాసన వస్తుందని, ఈగలు, దోమలతో డెంగ్యు, మలేరియ వ్యాధులు సోకుతున్నాయని, కాలనీలలో సీసీ రోడ్లు లేవని, ఇంటింటికి మిషన్ భగీరత నల్లాలు లేవని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఒక్కరికి కుడా రాలేదని మంత్రి ముందు వారి గోడును వెళ్లగక్కారు. కొంత మంది మహిళలు మంత్రితో మాట్లాడుతూ అమ్మ మీరు వస్తున్నారని చెప్పి మా కాలనీలలోని మురుగు కాలువలు, మట్టి రోడ్లన్నీ శుభ్రం చేశారని అన్నారు. ఎస్సీ కాలనీలోని పర్యటిస్తున్న సమయంలో మైసమ్మ దేవాలయంలో మంత్రి కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవాలయంలో కాలనీల సమస్యలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారమే పల్లెప్రగతిలో భాగంగా పల్లెలను ఎలా అభివృద్ధి చేసుకున్నామో పట్టణాలను అభివృద్ధి చేసుకొవాలనే ఉద్ధేశంతో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రణాళిక బద్ధంగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతితంగా మార్చి 4వ తేదిలో,10 రోజుల పాటు వార్డుల్లో పేరుకపోయిన సమస్యలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఆమనగల్లు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకేళ్లే బాధ్యత మన అందరిపై ఉందని ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పిలుపునిచ్చారు.
మంత్రి సమక్షంలోనే లొల్లి
పట్టణ ప్రగతిలో భాగంగా ఆమనగల్లులోని పలు వార్డులలో పర్యటిస్తు, మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆరో వార్డుకు చెందిన దివ్య శ్రీకాంత్ సింగ్, ఎంపీపీ అనిత విజయ్‌తో రసభాసా జరిగింది. మంత్రితో మా సమస్యలను విన్నవించకుండా ఎంపీపీ పెత్తనం చెలాయిస్తున్నారని ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే, మంత్రి కలుగ చేసుకొని సర్ది చెప్పడంతో సమస్య సర్దుమణిగింది.
సామాజిక బాధ్యతతో పరిశ్రమలు ముందుకు రావాలి : ఎమ్మెల్యే వివేక్
జీడిమెట్ల: సామాజిక బాధ్యతతో పరిశ్రమలు ముందుకు రావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుందిగల్ మున్సిపల్ పరిధిలోని గాగిల్లాపూర్‌లో శక్తి హార్మన్- జీఐజెడ్ జర్మనీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేక్ పాల్గొని మాట్లాడుతూ పట్టణీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కమ్యూనిటీలు బలపర్చడం, సమస్యల పరిష్కారం దిశగా వాటిని నడిపిస్తుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తి చేసుకుని సిబ్బందిని నియమిస్తూ వారితో కలిసి పట్టణ అభివృద్ధిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని వివరించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిశ్రమలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. శక్తి హార్మన్- జీఐజెడ్ పరిశ్రమ తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. వౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వానికి సహకరించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్మనీ ఎంబసీ కరిన్ స్టాల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి, కమిషనర్ సురేశ్, నాయకులు గోపాల్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, కావలి గణేశ్, అశోక్, గోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించడానికే ‘పట్టణ ప్రగతి’ : మేయర్ కొలను నీలా
ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28, 7, 26 డివిజన్‌లలో కమిషనర్ గోపి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌తో కలిసి మేయర్ కొలను నీలా పర్యటించారు. పార్వతీ విల్లాస్, ఓల్డ్ విలేజ్, శ్రీనివాస్ కాలనీ, మధురా నగర్ కాలనీ, రెడ్డీస్ ఏవెన్యూ, ఎన్‌టీఆర్ నగర్ తదితర కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కొలను నీలా మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని, అందుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బాచుపల్లి 16వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్‌లో కార్పొరేటర్ ఆగం పాండు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్‌లోని వీధులలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా నీటి సమస్య, ఇంటి పన్నుల ఆన్‌లైన్, 58 కింద పట్టాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు దృష్టికి వచ్చినట్లు ఆగం పాండు తెలిపారు. వాటి పరిష్కారానికి తక్షణమే ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
దుందిగల్‌లో...
దుందిగల్ మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డు దొమ్మర పోచంపల్లి గ్రామం, సారెగూడెం, లక్ష్మీపతి ఎన్‌క్లేవ్ తదితర కాలనీలలో కౌన్సిలర్ ముడిమేల రాముగౌడ్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. రాముగౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తప్పనిసరిగా పరిష్కరిస్తానని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు.