రంగారెడ్డి

గ్రామీణ అభివృద్ధికి రాష్ట్ర పథకాలను విస్తృతపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 26: గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అందించి పేదరిక నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణరాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టిసిపార్డు) లో రాష్ట్రంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంతో లబ్ధిదారులకు 100 రోజుల పని కల్పించి గ్రామీణాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు. ఉపాధి హామీపథకం కింద 56 లక్షల జాబ్‌కార్డులు మంజూరు చేసినట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, ఉపాధి హామీ పథకంలో కూడా రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలని ఆయన కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు చట్టాలపై అవగాహన పెంచుకొని గ్రామీణాభివృద్ధి లక్ష్యసాధన కోసం తన వంతు పాత్ర వహించాలన్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నాణ్యతా ప్రమాణాలపై పర్యవేక్షించినప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్నట్లు ప్రతిగ్రామం స్వయం సమృద్ది సాధించే విధంగా ప్రతి గ్రామ సమస్యలను ఆ గ్రామ పంచాయతీలోనే పరిష్కరించుకోవాలని హితబోధ చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగడం లేదని, ప్రతి పేదవాడికి జాబ్‌కార్డుతో వంద రోజులు పని కల్పించినప్పుడే వారు ఆర్థికంగా పురోగాభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ కార్యదర్శులు పని తీరును పాత రికార్డులను పరిశీలించి బాధ్యతరహితంగా పని చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి యేడాది హౌస్ ఒల్డ్ ద్వారా వంద రోజులు పని కల్పించి 60 శాతం అధిగమించాలని అధికారులకు వివరించారు. ఉపాధి హామీ పథకంలో 56 రకాల పనులు పొందుపరిచి ఉన్నాయని వాటిని కరపత్రాలు, ఆడియో, వీడియోలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకాల్లో మహిళా సంఘాలను, గ్రామ స్థాయి అధికారులను, ప్రజా సంఘాలను, రైతు సంఘాలను, కాలేజీ విద్యార్థులను పాఠశాలను భాగస్వామ్యం చేసినప్పుడే ఉపాధిహామీ పథకం విజయవంతవౌతుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారం, సానిటేషన్, ఇంకుడు గుంతలు, సేద్యపు గుంటలు, మరుగుదొడ్ల నిర్మాణాలు మొదలగు పనులను ప్రజలకుకల్పించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. కొత్త రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్వామా, ఆర్డి ఏ రెండు సంస్థలను కలిపి డి ఆర్డీవోగా ఒకే గొడుగు కిందకు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి పేదవానికి పింఛన్లు, వికలాంగులకు సదరన్ క్యాంపులు నిర్వహించి ధృవీకరణ పత్రాలతో పెన్షన్లను అందించాలని అధికారులకు సూచించారు. స్ర్తి నిధికి మహిళా బ్యాంకులు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు చెల్లింపులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తామని, జాబ్‌కార్డులు సర్వే చేసి వాటి స్థానంలో కొత్త కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెస్లీ, సైదులు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.