రంగారెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించినపుడే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, నవంబర్ 19: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం షాబాద్ మండల కేంద్రంలోని పిఆర్‌ఆర్ మినీ స్టేడియంలో షాబాద్ మండల మహిళా సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅథితిగా సునీతారెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య హజరయ్యారు. షాబాద్ మండల మహిళ సంఘాల సభ్యులు అందరు కలిసి 3కోట్లా50లక్షల రూపాయలు జమ చేసుకోవడం ఎంతో మంచిదన్నారు. ప్రతి సంవత్సరం మహిళలు అందరు కలిసి తమ పొదుపు బ్యాంకు లావాదేవీలను సరి చేసుకుంటే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుదని పేర్కొన్నారు. షాబాద్ మండలంలో 635 గ్రూపులకు 14300 మంది సభ్యులుగా చేరి నేడు మూడు కోట్ల రూపాయలకు పైగా పోగు చేసుకోవడం అభినందనీయమని అన్నా. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధిలో భాగంగా మహిళలు తమ సంపాదించుకున్న డబ్బులను మహిళా స్నేహ సోసైటీ బ్యాంకులో జమ చేసుకోవాలని తెలిపారు. మహిళలు రాత్రి సమయంలో సాక్షరభారతి నైట్ పాఠశాలలో చదువుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి లక్ష్మి, ఎంపిపి జ్యోతి రవికుమార్, ఎంపిడివో పద్మావతి, ఏపిఎం నర్సింలు, స్నేహ మహిళ సోసైటీ బ్యాంక్ నిర్వహకురాలు మంజుల, తహశీల్దార్ ఉషాకిరణ్, షాబాద్ సర్పంచ్ వెంకట్ యాదవ్, మద్దుర్ మల్లేష్, మల్లారెడ్డి, ఎంపిటిసిలు సత్యనారయణ, పాండు పాల్గొన్నారు.
ఇంటి పన్ను వసూళ్లలో
షాబాద్ అధ్వాన్నం
ఇంటి పన్ను వసూలులో షాబాద్ మండలం అధ్వాన్నంగా ఉందని అధికారుల తీరుపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి ట్యాక్స్ గురించి అధికారులను అడగడంతో మండలం కేవలం 4శాతం ట్యాక్స్ వసూలు చేశామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులందరు సమష్టిగా పని చేసి టాక్స్ వసూళ్ల శాతాన్ని పెంచాలని సూచించారు. షాబాద్ మండలంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుచించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే యాదయ్య, జడ్‌పిటిసి లక్ష్మి, ఎంపిపి జ్యోతి రవికుమార్, ఇవోఆర్‌డి వసంతలక్ష్మి, వ్యవసాయ అధికారిణి సంయుక్త, పశువైద్యాధికారి కార్తీక్ పాల్గొన్నారు.

ఇందిరాగాంధీకి ఘన నివాళి

చేవెళ్ల, నవంబర్ 19: దివంగాత ప్రధాని ఇందిరా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గల అభివృద్ధి కోసం ఆమె చేసిన మేలు మర్వలేమని అన్నారు. దేశంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అములు చేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు.
కీసరలో..
కీసర: కీసరలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు శనివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ చౌరస్తాలో ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో పేదవాడికి పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు జంగయ్య యాదవ్, రమేశ్ గుప్తా, నాయకులు ధర్మారెడ్డి, అంజేనేయులు గౌడ్ పాల్గొన్నారు.
మహిళలకు నిత్యవసర
సరుకుల పంపిణీ
చాంద్రాయణగుట్ట: భారత మాజీ ప్రధాన మంత్రి ఇందీరాగాంధీ జయంతిని జంగమ్మెట్‌లో ఘనంగా నిర్వహించారు. జంగమ్మెట్‌లోని ఇంధీరాగాంధీ విగ్రహం వద్ద శనివారం జరగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ విభాగం హైదరాబాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఎస్‌పి క్రాంతికుమార్ విచ్చేసి ఇందీరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ ఇందీరాగాంధీ భారత దేశ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని, పెదరికం నిర్మూలన కోసం గరిబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జంగమ్మెట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్కల నర్సింగ్‌రావు, జి.లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకులు కె.అజామ్, ప్రశాంత్, సాయినాథ్, భానుప్రకాష్ పాల్గొన్నారు.
శంకర్‌పల్లిలో..
శంకర్‌పల్లి: మాజీ ప్రధాని ఇందిరాగాంది ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని శంకర్‌పల్లి ఎంపిపి నర్సింలు తెలిపారు. శనివారం శంకర్‌పల్లి చౌరస్తాలో ఇందిర చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జడ్‌పిటిసి కళావతి విఠల్, వైస్ యంపిపి శశిధర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, టౌన్ అధ్యక్షుడు పి.బాలకృష్ణ, మాజీ సర్పంచ్ రవిందర్, నాయకులు మంతాజ్, గౌస్, రంపాల్, రైతు సంఘం నాయకులు గోపాల్‌చారి పాల్గొన్నారు.

దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి
తీసుకెళ్లిన ఘనత ఇందిరమ్మదే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 19: దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత ఇందిరా గాంధీదేనని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తొలి మహిళా ప్రధాని, భారత రత్న ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవం సందర్భంగా శనివారం గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఇందిరా గాంధీ అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాలను ఈ ఏడాది మొత్తం అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు, టి.పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

అల్మాస్‌గూడలో వంట గ్యాస్ లీక్
సరూర్‌నగర్, నవంబర్ 19: వంట గ్యాస్ సీలిండర్ లీక్ అవడంతో మంటలు అంటుకొని అక్కాచెల్లెళ్లు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు. మీర్‌పేట్ పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అల్మాస్‌గూడలో నివాసం ఉండే టింగ్లికర్ లావణ్య (35), టింగ్లికర్ పద్మా (31) గ్యాస్ సీలిండర్ లీక్ అవడంతో మంటలు అంటుకొని, తీవ్రగాయాలపాలై అపోలో డిఆర్‌డిఎల్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టుతున్నారు. ఈనెల 14న సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంటిలోని వంట గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో, ఇంటిలో ఉన్న మరో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌ను పెట్టుటకు దాని కవర్‌ను రఘు భార్య లావణ్య తొలగించింది. కవర్ తీయడంతో గ్యాస్ బలంగా ఊవెత్తునపైకి రావడంతో లావణ్య అలానే వత్తి పట్టుకుంది. పక్కనే ఉన్న తన చెల్లెలు పద్మా వచ్చి గ్యాస్ లీక్‌ను ఆపేందుకు ప్రయత్నించింది. గ్యాస్ అప్పటికే ఇళ్లు మొత్తం వ్యాపిచడంతో, సమీపంలోనే దేవుని ముందు దీపాలు ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో లావణ్య, పద్మా తీవ్రగాయాల పాలైనారు. ప్రస్తుతం పద్మా 80 శాతం, లావణ్య 40 శాతం కాలిన గాయాలతో అపోలో ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. ఇరువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు.
దర్యాప్తు చేపట్టాం
సంఘటన అనంతరం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దరఖాస్తు స్వీకరించినట్లు ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు. దరఖాస్తు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
గ్యాస్ లీక్‌తో ప్రమాదానికి గురైన బాధితులను గ్యాస్ కంపెనీతో పాటు డిస్టిబ్యూటర్ ఆదుకోవాలని అల్మాస్‌గూడ మాజీ సర్పంచి రామిడి రాంరెడ్డి కోరారు. రఘు కుటుంబానికి జరగరాని ఘటన జరిగినందున వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. గ్యాస్ సఫ్లైదారులు డెలివర్ చేసే ముందు దానిని ఓపెన్ చేసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చిన అనంతరం గ్యాస్ బండా అందించాలని రాంరెడ్డి తెలిపారు. ఇది ముమ్మటికి గ్యాస్ లీక్‌తో జరిగిన ఘటన కావడంతో గ్యాస్ సంస్థలది, సరఫరా నిర్వహకులదే బాధ్యతని అన్నారు. గ్యాస్ సంస్థ నుంచి వచ్చే బీమాతో పాటు, హస్తినాపురంలోని ఇండియన్ గ్యాస్ సరఫరా నిర్వహకులు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

బాలల రక్షణ కోసం సమాజం కృషి చేయాలి

ధారూర్, నవంబర్ 19: బాలల రక్షణ కోసం సమాజం కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో బాలల వారోత్సవంలో భాగంగా ఎస్పీ కార్యాలయంలో బాలల హక్కుల సంరక్షణకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని బాలల్లో 19 శాతం భారతదేశంలో ఉన్నారని చెప్పారు. కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతోనే బాలలు కార్మికులుగా మారడం, లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. కొందరు బాలలు బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలపై ఆకృత్యాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 2011 లెక్కల ప్రకారం ప్రతి 130 నిమిషాలకో బాలిక లైంగిక వేధింపుల బారిన పడుతోందని వివరించారు. దేవుళ్ళతో సమానమైన పిల్లలు వేధింపులకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లతామాధురి, తహశీల్దార్ చిన్నప్పలన

వికారాబాద్ జిల్లాలో ఆదర్శ పాఠశాలలు, హాస్టళ్ళకు రూ.24.50 కోట్లు

ధారూర్, నవంబర్ 19: జిల్లాలో ఏర్పాటు చేసిన 19 ఆదర్శ పాఠశాలలు, అనుబంధ వసతి గృహాలకు రూ.24.50 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నవాబ్‌పేట మండల కేంద్రంలో కోటి 29 లక్షల వ్యయంతో నిర్మించిన ఆదర్శ పాఠశాల అనుబంధ వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల్లో అన్ని వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. జిల్లాలో 40 కోట్ల వ్యయంతో డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు ఐటిఐ భవనాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, తాండూర్, హయత్‌నగర్‌లలో డిగ్రీ కళాశాలల నూతన భవనాల నిర్మాణాలకు రూ.2.25 కోట్ల చొప్పున 12 కోట్ల నిధులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ఏడు పాలిటెక్నిక్ కళాశాలల భవనాల నిర్మాణాలకు 19 కోట్ల నిధులను మంజూరయ్యాయని అన్నారు. ఆరు జూనియర్ కళాశాలల భవనాలకు రూ.9.34 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. వెనుకబడిన అందరూ చదువుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి విద్యార్థులకు గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు వెచ్చించిందని చెప్పారు. అందరికీ విద్యను అందించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీతో పాటు ఫర్నిచర్ సమకూరుస్తోందని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తులు చేపట్టడంతో పాటు విద్యార్థులు పోటీ పరీక్షల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చేవెళ్ళ శాసనసభ్యుడు కాలె యాదయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అందరికి మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాలకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నవాబ్‌పేట ఎంపిపి పాండురంగారెడ్డి, జడ్పీటిసి పి.రాంరెడ్డి, సర్పంచ్ జంగయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి ఖదీర్, ఎంపిడివో ప్రమీల, తహశీల్దార్ యాదయ్య, ఎంఇవో గోపాల్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ యోగ్నిశ్రీ పాల్గొన్నారు.